సినిమా రైతుల స్నేహ బంధం

Update: 2018-05-22 07:56 GMT
సినిమా ఫీల్డ్ లో ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా నటీనటులకు తమకంటూ ఇష్టమైన వ్యాపకాలు వ్యాపారాలు చేయటంలో ఉన్న  ఆనందమే వేరు. ఒకప్పుడు అందాల నటుడు శోభన్ బాబు రియల్ ఎస్టేట్ లో ఈ విధంగా మక్కువ పెంచుకునే జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు . అంత దాకా ఎందుకు. టాక్ అఫ్ ది టౌన్ గా మారిన మహానటి సినిమాలో సావిత్రి గారు  ఫ్యాక్టరీ పెట్టినట్టుగా చూపించారుగా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వ్యవసాయం మీద మక్కువ పెంచుకున్న టాలీవుడ్ ప్రముఖులు కూడా ఎందరో ఉన్నారు. అందులో ఒకరు సీనియర్ నరేష్. హైదరాబాద్ శివార్లలో స్వంతంగా ఫార్మ్ హౌస్ ఏర్పాటు చేసుకున్న నరేష్ వీలు కుదిరినప్పుడంతా స్వయంగా దాని బాగోగులు చూసుకుంటున్నారు. ఇది సందర్శించడానికి వచ్చిన మిత్రులు ప్రకాష్ రాజ్-రాజేంద్ర ప్రసాద్ తో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు నరేష్.

తన తోటి రైతులు వచ్చారని ప్రకాష్ రాజ్ కు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని ఇలాంటి అభిరుచి తమలాంటి వాళ్ళను ఏకం చేస్తోందని సంతోషం వ్యక్తం చేసాడు. నరేష్ కు రాజేంద్ర ప్రసాద్ తో ఉన్న సాన్నిహిత్యం ఈ నాటిది కాదు. 80వ దశకంలో జంధ్యాల గారి హాస్య చిత్రాలు రాజ్యమేలుతున్నప్పుడు ఈ ఇద్దరే అధిక శాతం  వాటిలో హీరోలుగా కనిపించే వాళ్ళు. అంతెందుకు స్టార్ హీరోలకు సైతం ధీటుగా కామెడీ హీరోలుగా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవడం వీరికే చెల్లింది. చంద్ర మోహన్ కూడా ఇదే లీగ్ లో ఉన్నారు అప్పుడు. ఇలా దశాబ్దాల తర్వాత తన స్నేహాన్ని కొనసాగిస్తున్న నరేష్ ట్వీట్ కు  స్పందన కూడా బాగుంది.
Tags:    

Similar News