మా ఎన్నికల్లో ఓటమి పాలయిన ప్రకాష్ రాజ్ తన మా సభ్యత్వంకు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే తన రాజీనామాను మా అధ్యక్షుడు మంచు విష్ణుకు కూడా పంపించడం జరిగింది. మా సభ్యులు నన్ను స్థానికుడు కాదు అనే ఉద్దేశ్యంతో ఓడించారు. ఇలాంటి వారి మద్య నేను ఉండాలనుకోవడం లేదు. నేను అధ్యక్షుడిగా అయ్యేందుకు అర్హత లేనప్పుడు ఎందుకు మా లో కొనసాగాలంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలుపు ఖాయం అనుకున్న సమయంలో అనూహ్యంగా స్థానికత తెరపైకి వచ్చి ఆయన్ను ఓడించడం జరిగింది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నాడు. పాతికేళ తెలుగు సినిమా పరిశ్రమ అనుబంధం ఉంది. అలాంటి నన్ను స్థానికుడు కాదు అంటూ ఓడించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
రాజీనామాను వెనక్కు తీసుకోవాల్సిందిగా పలువురు ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు. అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఇప్పటికే గెలుపు ఓటములు అనేవి సహజం. ఓటమికే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదు అంటూ ప్రకాష్ రాజ్ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. మా సభ్యుడిగా కొనసాగడం అస్సలు ఇష్టం లేని ప్రకాష్ రాజ్ తన నిర్ణయాన్ని అస్సలు మార్చుకునేది లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరోసారి ట్విట్టర్ లో మా సభ్యత్వంను వదులుకోవడం పట్ల స్పందిస్తూ.. నేను మా నుండి తప్పుకోవడం వెనుక పెద్ద కారణం ఉంది. చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా రాజీనామాకు లోతైన అర్థం ఉంది. కనుక ఎవరు కూడా నా నిర్ణయంను తప్పుపట్టవద్దని కోరాడు. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నాడు.
తన కోసం నిలిచిన మా సభ్యులు గర్వపడేలా ఉంటాను కాని వారిని ఎప్పుడు కూడా తల దించుకునేలా చేయను అన్నాడు. మా లో ఉన్నంత కాలం తనను చాలా మంది సపోర్ట్ చేశారని.. వారందరికి కూడా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు. తన రాజీనామా వెనుక ఉన్న లోతైన అర్థంను త్వరలోనే వెళ్లడిస్తాను అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. మా ఎన్నికల తర్వాత ఈ హడావుడి ఉండదు అని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా మీడియా ముందుకు ప్రకాష్ రాజ్ రాజీనామాతో రావడంతో మళ్లీ మా వేడి కొనసాగుతున్నట్లుగా మీడియాలో రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వ్యవహారం మరెంత దూరం వెళ్తుందో అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.