సవాళ్లు, ప్రతిసవాళ్లు ముగిశాయి. మాటల యుద్ధానికి తెరపడి 'మా' ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఇన్నాళ్లు తిట్టుకున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లు ఒక్కటయ్యారు. రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్ధానాలు, మాటల యుద్ధం చేసుకున్న ఈ ఇద్దరూ ఒకే ఒక్క హగ్ తో అన్నింటికి పుల్ స్టాప్ పెట్టేశారు.
సాధారణ రాజకీయాలను తలదన్నే రీతిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. గతంలో లేని విధంగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ ఎన్నికలు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని రెండు వర్గాలు చీల్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ ఎన్నికల ఫలితం అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సామాన్య జనాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో 'మా' ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
నిన్నటి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మా ఎన్నికల వేళ కలిసిపోయారు. పోలింగ్ ప్రారంభానికి ముందుగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందుగా మోహన్ బాబు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. అక్కడ ఎదురుపడిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారు. మోహన్ బాబు సమక్షంలో ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. ప్రకాష్ రాజ్ వెంటనే మోహన్ బాబుకు పాదాభివందనం చేసే ప్రయత్నం చేయగా.. ప్రకాష్ రాజ్ ను వారించిన మోహన్ బాబు భుజం తట్టి ఆశీర్వదించారు. ఇక మాటల మంటలు రేపిన మాజీ అధ్యక్షుడు నరేశ్ సైతం అక్కడే పక్కనే ఉండడం విశేషం.
ఇక రెండు ప్యానెళ్ల నుంచి పోటీ చేస్తున్న సభ్యులు సైతం 'పోలింగ్' సాధ్యమైనంత ఎక్కువగా జరిగేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తసున్నారు. గతం కంటే ఈసారి 'మా' ఎన్నికల్లో పోలింగ్ జరుగుతుందని అంచనావేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ సాగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటల కు తుది ఫలితం వెలువడే చాన్స్ ఉంది.
Full View