ప్ర‌కాష్ రాజ్ పంచాయితీ చిరంజీవి ముందుకు?

Update: 2021-06-27 13:30 GMT
``ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మా అసోసియేష‌న్ ఎన్నికల్లో ఓటు వేయని వ్యక్తి.. అసోసియేషన్ స‌ర్వ‌స‌భ్య‌ సమావేశానికి హాజరుకాని న‌టుడు ఇప్పుడు హఠాత్తుగా `మా` అధ్యక్షుడవ్వాలనుకోవడం స‌రైన‌దేనా? అని ప్ర‌శ్నించారు మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్య‌క్షుడు న‌రేష్ వీకే. ప్ర‌కాష్ రాజ్ నుద్ధేశించి ఆయ‌న పైవిధంగా ప్ర‌శ్నించారు. శ‌నివారం జ‌రిగిన పాత్రికేయ స‌మావేశంలో న‌రేష్ త‌న ఆవేద‌న‌ను మీడియా ముందు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

గ‌త క‌మిటీ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ప‌ద‌వీ కాలం మార్పు మేర‌కు సెప్టెంబ‌ర్ 2021 వ‌ర‌కూ టైమ్ ఉండ‌గా కొంద‌రు ఎలాంటి స‌మాచారం లేకుండా మీడియా ముందుకు వ‌చ్చేసి ప్యానెల్ ను ప్ర‌క‌టించేయ‌డం తో పాటు మా అంద‌రిపైనా నిరాధార ఆరోప‌ణ‌లు చేసారు. దీనిపై క్ర‌మశిక్ష‌ణా క‌మిటీకి ఫిర్యాదు చేస్తాం అన్నారు. ఏం చేయాలో క‌మిటీ పెద్ద‌లు చిరంజీవి - మోహ‌న్ బాబు నిర్ణ‌యిస్తార‌ని అన్నారు.

మా ప్రతిష్ఠ మ‌స‌క‌బారింద‌ని మా అసోసియేష‌న్ గ‌త అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన నాగ‌బాబు అన‌డం స‌రి కాద‌ని అన్నారు. ఆ స్థాయి వ్య‌క్తి అనాల్సిన‌ది కాద‌ని అన్నారు. ఇక్క‌డ స‌మ‌స్య‌లేంటో నాగ‌బాబుకు చెప్పామ‌ని తెలిసీ ఆయ‌న అలా అనాల్సింది కాదు అని అన్నారు. ఇన్నేళ్ల‌లో 25 మంది అధ్య‌క్షులు ప‌ని చేసినా మా సొంత భ‌వంతి సాధ్య‌ప‌డ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మేం చేసిన పనుల్ని తక్కువగా చేసి చూపించి మమ్మల్ని హింసిస్తున్నారు.. కానీ హింసకు లొంగేది లేదు అని కూడా న‌రేష్ వ్యాఖ్యానించారు. త‌మ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని చిరంజీవి మెచ్చుకున్నార‌ని న‌రేష్ అన్నారు.
Tags:    

Similar News