దర్శకుడిగా ప్రకాష్ రాజ్ ప్రతిసారీ మంచి సినిమానే చేస్తున్నాడు. కానీ సరైన ఫలితం రావడం లేదు. కొన్నేళ్ల కిందట ఆయన ‘ధోని’ అనే సినిమా తీశారు. చాలా గొప్ప సినిమా అది. పిల్లల విషయంలో తల్లిదండ్రుల తీరు ఎలా ఉండాలో ఒక పాఠం లాగా చెప్పాడు ప్రకాష్ రాజ్. హృదయాల్ని తట్టే సినిమా అది. చాలా హృద్యంగా తెరకెక్కించాడు. ఆ సినిమాను సరిగా ప్రమోట్ చేయకపోవడం.. సరిగా రిలీజ్ చేయకపోవడం వల్ల జనాల్లోకి వెళ్లలేదు. ఇప్పుడు తాజాగా ‘మనవూరి రామాయణం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు ప్రకాష్ రాజ్. ఇది కూడా చాలా మంచి సినిమా. గొప్ప సినిమా. ఈ సినిమా ద్వారా చాలా మంచి విషయాలు చెప్పాడాయన. ఒక మంచి కథాంశాన్ని చాలా అందంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అంతర్లీనంగా మంచి సందేశం ఉన్న సినిమా ఇది. అభిరుచి ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
కానీ దసరాకు నాలుగు సినిమాలతో పోటీకి దిగి పెద్ద తప్పు చేశాడు ప్రకాష్ రాజ్. మిగతా సినిమాల్లో దేని ఆకర్షణ దానికుంది. ‘మనవూరి రామాయణం’ మాత్రం జనాల్ని ఆకర్షించలేదు. ఇదేదో ఇంటలెక్చువల్స్ కోసం తీసిన సినిమా అన్నట్లు సామాన్య జనం దీన్ని పట్టించుకోలేదు. ఒకవేళ చూద్దామన్నా దగ్గర్లో థియేటర్లలో సినిమా లేదు. సిటీల్లో సింగిల్ స్క్రీన్లలో దాదాపుగా సినిమా కనిపించడం లేదు. మల్టీప్లెక్సుల్లో మాత్రమే రిలీజ్ చేశారు. అక్కడ కూడా బుకింగ్స్ అంతంతమాత్రంగా ఉన్నాయి. పోటీ ఎక్కువుండటం వల్ల వచ్చిన ఇబ్బందిది. ‘ప్రేమమ్’ సూపర్ హిట్ టాక్ రావడంతో అందరూ దానివైపే చూస్తున్నాడు. ‘అభినేత్రి’కి అట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. ‘ఈడు గోల్డ్ ఎహే’కు మాస్ ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. చివరికి ‘జాగ్వార్’కు కూడా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ‘మనవూరి రామాయణం’కు సరైన స్క్రీన్లూ ఇవ్వలేదు. ఇచ్చిన చోటా కలెక్షన్లు లేవు. మొత్తంగా ఒక గొప్ప సినిమా నిరాదరణకు గురవుతోంది. ప్రకాష్ రాజ్ ఇలాంటి పోటీ మధ్య కాకుండా మామూలు టైంలో సినిమాను రిలీజ్ చేసి ఉంటే బాగుండేది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/