తెలుగు చిత్ర పరిశ్రమలో రసవత్తరంగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పోరుముగిసింది. ఎన్నడూ లేని విధంగా ప్రధాన నటీనటులూ పరస్పర వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తించాయి. ఎన్నో ఆరోపణలు, విమర్శల నడుమ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో నిన్న ఆదివారం ఎన్నికలు పూర్తయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎలక్షన్స్ లో ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొంది 'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తాజా ప్రెస్ మీట్ లో తన పరాజయం మాట్లాడుతూ.. 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని.. తెలుగువాడిగా పుట్టకపోవడం తన దురదృష్టకరమన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే ఉంటానని ప్రకాశ్ రాజ్ అన్నారు.
'మా' ఎన్నికలు సజావుగా జరిగాయి. చైతన్యంతో ఈసారి ఎక్కువ మంది ఓట్లు వేశారు. తెలుగు బిడ్డను.. మంచి వ్యక్తిని ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నా. ప్రాంతీయవాదం - జాతీయ వాదం మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. తెలుగు వ్యక్తి కాని వాడు ఓటు వేయవచ్చు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే నినాదం ప్రారంభించారు. మీరు వచ్చిన తర్వాత ఆ నిబంధనలు మారుస్తానని కూడా చెప్పారు. నా తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు. అది నా తప్పు కాదు, వాళ్ళ తప్పు. తెలుగు వ్యక్తే ‘మా’ అధ్యక్షుడుగా కావాలనుకున్నారు. తెలుగువాడిగా పుట్టకపోవడం నా దురదృష్టకరం. కానీ నాకు కళాకారుడిగా ఆత్మ గౌరవం ఉంది. అతిథిగా వచ్చాను.. అతిథిగానే ఉంటాను. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని ప్రకాశ్ రాజ్ ప్రకటించారు.
''నాకు ‘మా’ తో 21ఏళ్ల అనుబంధం. ‘మా’ కుటుంబంలో అందరూ ఒక్కటే అనేది అబద్ధం. ఓటమి జీర్ణించుకున్నాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇకపై మాలో భాగస్వామ్యంగా ఉండలేను. లోకల్ - నాన్ లోకల్ ఎజెండాల మధ్య ఉండలేను. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో నేను అతిథిగా ఉండాలంటే అసోసియేషన్ మెంబర్ గా ఉండకూడదు. కొందరు నన్ను అతిథిగా మాత్రమే ఉండమన్నారు. పెద్దలు మోహన్ బాబు గారు - కోట గారు - రవిబాబు వీళ్లంతా అతిథిగా వస్తే అతిథిగానే ఉండాలని చెప్పారు. అలాగే ఉంటా. మీరు అనుకున్నది జరిగింది'' అని ప్రకాష్ రాజ్ తెలిపారు.
నాకు ఓట్లు వేసిన అందరికీ కృతజ్ఞతలు. మంచు విష్ణు - రఘు బాబు - రవి - శివ బాలాజీ లతో పాటు గెలిచిన వారందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు. మీరు అతి పెద్ద ప్రణాళిక తో వచ్చారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని అన్నారు. అసోసియేషన్ నుంచే బయటికి వచ్చాను కానీ తెలుగు సినిమా నుంచి బయటకు రాలేదు. సినిమాలు చేస్తూనే ఉంటాను. సభ్యులతో కలిసి నటిస్తాను. వారికి ఏం కావాలన్నా చేస్తాను అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
భాజపా నేత బండి సంజయ్ ట్వీట్ గురించి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల వారు తెలుగు సినిమాల్లో నటించకూడదనే నిబంధనలు ఏమీ లేవని.. అందుకే తెలుగు సినిమాల్లో ఎప్పటి లాగే నటిస్తానని.. తాను యూనివర్సల్ పర్సన్ అని ప్రకాష్ రాజ్ సమాధానం ఇచ్చారు. ఓడిపోయానని రాజకీయాలను వదిలేయలేదని.. అలాగే ‘మా’ ను వదిలేస్తున్నానే తప్పు తెలుగు సినిమాను కాదని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.