మిగిలిన విషయాల్లో వ్యూహం ఎంత ముఖ్యమో.. ఎన్నికలు లాంటి వాటిల్లో మరింత ముఖ్యం. ఇవాల్టి రోజున బోడి అపార్ట్ మెంట్ ఎన్నికలకు సంబంధించే తెర వెనుక చక్కబెట్టాల్సిన అంశాలు బోలెడన్ని ఉంటాయి. చూసేందుకు వెయ్యికి లోపే ఓట్లు ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికలంటే.. దాని వెనుక ఉండే రాజకీయాలు అన్ని ఇన్ని కావు. ఈ విషయాన్ని ఎన్నికల బరిలో నిలిచిన ప్రతివారు గుర్తించాల్సిందే. ఒకవేళ ఆ వాస్తవాన్ని ఒప్పుకోకుంటే.. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కు ఎదురైన పరిస్థితులే ఎదురవుతుంటాయి.
ఆదర్శాలు చెప్పటం వేరు.. వాటిని ఫాలో కావటం వేరు. ఆదర్శవంతంగా ఉండటం కోసం ఆదర్శాల్ని పక్కాగా అనుసరిస్తే.. ఆదర్శాలు ఎప్పటికి గెలవన్న సత్యం ప్రకాశ్ రాజ్ కు ఇప్పటికైనా అర్థమవుతుందో? లేదో? తన దగ్గర పని చేసే ఉద్యోగులకు ఇళ్లుకట్టించి ఇచ్చిన పెద్ద మనసు ప్రకాశ్ రాజ్ ది. అలాంటి ప్రకాశ్ రాజ్.. ‘మా’ భవనాన్ని తన సొంత డబ్బులతో కట్టిస్తానని ఎందుకు చెప్పలేకపోయాడు? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. మాటల్లో చెప్పింతన తేలికైన విషయం కాదు కాబట్టి. అలా చెప్పి.. మాట తప్పటం ఇష్టం లేకనే.
కానీ.. యుద్ధంలో మంచి.. చెడులు అన్న పదాలకు అర్థం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఆ ప్రాథమిక సత్యాన్ని మిస్ అయితే.. ఎన్నికల్లో విజయం అన్నది ఎప్పటికి సాధ్యం కాదు. వాస్తవానికి మా ఎన్నికల గురించి ప్రస్తావించి.. తన టీంను పరిచయం చేయటం ద్వారా.. ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్కును ప్రకాశ్ రాజ్ చేశారన్నట్లుగా కనిపించింది. అయితే.. తర్వాత రంగంలోకి దిగిన మంచు విష్ణు.. ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో ఎప్పుడేం చేయాలన్న దాన్నిపక్కాగా చేయటం ద్వారా.. తాను అనుకున్నది సాధించారు.
ఆ వేగాన్ని అందిపుచ్చుకోవటంలో ప్రకాశ్ రాజ్ అడ్డంగా ఫెయిల్ అయ్యారు. ‘మా’ సొంత భవనం లోటును తాను తీరుస్తానని చెప్పటమే కాదు.. మా భవనాన్ని నేనే కడతానని చెప్పి మిగిలిన వారి మీద పైచేయి సాధించాడు విష్ణు. అంతమంది స్టార్లు ఉండి.. ‘మా’ అసోసియేషన్ కు ఒక బిల్డింగ్ లేకపోవటం ఏమిటన్న ప్రశ్నను.. సింఫుల్ గా ఒక్కమాటతో తేల్చేశాడు. తన మాటతో మార్కులు కొట్టేయటం షురూ చేసిన విష్ణు.. తర్వాతి దశల్లో ఎన్నికల్లో విజయం కోసం ఏమేం చేయాలో అవన్నీ చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల విషయంలో పైచేయి సాధించిన అతడు.. ఎప్పుడు ‘మా’ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రాని వారిని ప్రత్యేకంగా అభ్యర్థించటమేకాదు వారికి ఫ్లైట్ టికెట్లు మొదలు.. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నుంచి ఓటు వేసి తిరిగి వెళ్లే వరకు వారికి అవసరమైన అన్నింటిని తాను సమకూరుస్తానని మాట ఇవ్వటమే కాదు.. అవన్నీ చేతల్లో చేసి చూపించినప్పుడు.. ఆ అభిమానం ఓట్ల వర్షంగా కురవకుండా మారుతుందా?
అంతేనా.. ఎన్నికలకు ముందు అందరిని కలిసి.. కొందరికి ఇష్టమైన పార్టీలు ఏర్పాటు చేసే విషయంలోనూ విష్ణు వెనుకాడలేదు. అతడి ఫోకస్ అంతా గెలుపు మీదనే ఉంది తప్పించి.. ఎలా గెలుస్తున్నాం? అన్న దాని మీద కాదన్నది మర్చిపోకూడదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. గత ఎన్నికల్లో మెగా కాంపౌండ్ వారి ఆశీస్సులతో ఎన్నికైన నరేశ్ ను.. సమయానికి అనుగుణంగా తమకు తగ్గట్లుగా మార్చుకోవటం విష్ణు టీం సక్సెస్ గా చెప్పాలి. తన వెనకున్న మెగా టీం గతంలో గెలిపించిన నరేశ్ తమ తరఫున పని చేయకపోవటం తమకు నష్టమన్న విషయాన్ని ప్రకాశ్ రాజ్ గుర్తించకపోవటం.. దాన్ని సరి చేసుకునే విషయంలో దొర్లిన తప్పు కూడా ఓటమికి కారణంగా చెప్పాలి. నరేశ్ కు 150 ఓట్లు ఉండటం.. ఆయన ఎటు ఉంటే ఆ ఓట్లు అన్ని వారికే పడతాయన్న విషయాన్ని ప్రకాశ్ రాజ్ మరింత సీరియస్ గా తీసుకోవాల్సి ఉంది.
విష్ణు టీం ఎన్నికల వ్యూహాన్ని చూసినప్పుడు.. ప్రకాశ్ రాజ్ విషయంలో ఒకరు ఆయన షూటింగ్ లకు సమయానికి రారంటూ ఆయన లోపాల్ని ఎత్తి చూపటం.. గతంలో ఆయన ఎన్నికల్లో ఓటు వేయలేదన్న విషయాన్ని మరొకరు.. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అని ఇంకొకరు..ఇలా లోపాల మీద లోపాల్ని ఎత్తి చూపటం.. అదే సమయంలో విష్ణు మీద ఫలానా నెగిటివ్ పాయింట్ చర్చకు రాకపోవటం కూడా లాభించింది. ఈ విషయంలోనూ ప్రకాశ్ రాజ్ వ్యూహలోపం.. ఆయన్ను ఓడిపోయేలా చేసిందని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ప్రకాశ్ రాజ్ ఓటమి ఆయన చేతులారా చేసుకున్నదే తప్పించి.. ఆయన్ను ప్రత్యర్థులు ఓడించ లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.