మెగా డాట‌ర్ పాలిట‌ విల‌న్‌ ఆయనే

Update: 2015-11-19 05:30 GMT
ఎన్నో సినిమాల్లో వైవిధ్య‌మైన క్యారెక్ట‌ర్ ల‌లో న‌టించి మెప్పించాడు ప్ర‌కాష్‌ రాజ్‌. మెగాస్టార చిరంజీవి న‌టించిన మెగా మూవీస్‌ లో విల‌న్‌ గా అసాధార‌ణ పెర్ఫామెన్స్‌ తో మెప్పించాడు. ఇటీవ‌లి కాలంలో రాంచ‌ర‌ణ్ హీరోగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గోవిందుడు అంద‌రివాడేలే చిత్రంలో చ‌ర‌ణ్‌ కి తాత క్యారెక్ట‌ర్‌ లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ - స్ట‌యిలిస్ స్టార్ బ‌న్ని సినిమాల్లోనూ ప్ర‌కాష్‌ రాజ్ విల‌నీ చేశాడు. ఇలా మెగా ఫ్యామిలీ హీరోల‌తో ప్ర‌కాష్‌ రాజ్ అనుబంధం చాలా కాలంగా సాగుతోంది. ఇప్పుడు మెగా డాట‌ర్ నీహారిక న‌టిస్తున్న సినిమాలోనూ ఆయ‌న ఓ కీల‌క‌మైన క్యారెక్ట‌ర్‌ లో న‌టిస్తుండ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ర్టీ అయ్యింది.

మ‌ల్లెల తీరంలో సిరిమ‌ల్లె పువ్వు ఫేం రామ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో నీహారిక ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ఒక్క మ‌న‌సు అనే టైటిల్ క‌న్ఫ‌మ్ చేశారు. ఇందులో క‌థానాయ‌కుడిగా నాగ‌శౌర్య న‌టిస్తే బావుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాతలు భావించారు. నాగ‌శౌర్య కాస్త ఆల‌స్యంగా స్పందించినా నీహారిక స‌ర‌స‌న ఓకే అయ్యాడు. ఇప్పుడు అత‌డి తండ్రి పాత్ర‌కి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌ రాజ్‌ ని ఎంపిక చేశారు. నాగ‌శౌర్య‌కి తండ్రి అంటే నీహారికకు ఈ చిత్రంలో మామ వ‌రుస అన్న‌మాట‌! ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌. దీన్నిబ‌ట్టి నీహారిక కు విల‌న్ ప్ర‌కాష్‌ రాజ్ అన్న‌మాట‌.

Tags:    

Similar News