ఇప్పుడు అందరూ ఈ డెడికేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. అదేంటి నిన్న పొద్దున్నే ఆమె యాక్సిడెంట్ కు గురైంది.. ఇప్పుడు సడన్ గా ఈ డెడికేషన్ గురించి చెప్తున్నారేంటి అనుకుంటున్నారా?? అదే చెబుతున్నాం పదండి మరి.
నిజానికి నిన్న పొద్దున్నే యాక్సిడెంట్ అవ్వగానే ప్రణీతకు గాయాలు అవ్వకపోవడం అనేది నిజంగా దైవాదీనమే. సీటు బెల్టు పెట్టుకున్నా కూడా.. కారు రెండు మూడు పల్టీలు కొడితే.. కనీసం కాలో చెయ్యో బెణుకుతుంది చాలామందికి. కాని ప్రణీతకు మాత్రం చిన్న కట్ కూడా కాలేదట. ఇదంతా ఒకెత్తయితే.. యాక్సిడెంట్ లొకేషన్ నుండి తన బౌన్సర్లకు కేటాయించిన బస్సులో హైదరాబాద్ చేరుకున్న ఈ బాపు బొమ్మ.. వెంటనే చెన్నయ్ ఫ్లయిట్ ఎక్కేసింది. అక్కడ నిన్న సాయంత్రం ఎడిసన్ అవార్డ్స్ ప్రధానోత్సవాల్లో పాల్గొంది.
అసలు ఒక యాక్సిడెంట్ అయ్యిందంటే.. ఫిజికల్ దెబ్బలకంటే మానసికమైన షాక్ వాల్యూ అధికంగా ఉంటుంది. అయినాసరే అమ్మడు.. అక్కడి అవార్డు ఫంక్షన్ కు వస్తానని కమిట్ మెంట్ ఇచ్చిందట. అందుకే డెడికేటెడ్ గా చెన్నయ్ వెళ్లింది. గుడ్ ప్రణీత!!