నటసింహా బాలయ్య స్టయిలే వేరు. ఆయనకి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కథానాయికలు లేనిదే అసలు కునుకే పట్టదు. ఈ ఆచారం ఇప్పటిది కాదు.. సమరసింహారెడ్డి నుంచి కొనసాగిస్తున్నదే. ఆ చిత్రంలో ఏకంగా ముగ్గురు కథానాయికలు సిమ్రన్, సంఘవి, అంజలా జవేరీ ఇంతమంది నాయికలు ఉన్నారు. ఆ తర్వాత నరసింహానాయుడులోనూ సిమ్రన్, ప్రీతి జింగానియా, ఆశా షైనీ నాయికలు.
ఈ మధ్య కాలంలో సింహాలో నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత కథానాయికలుగా నటించారు. ఆ తర్వాత లెజెండ్‌లోనూ సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టేలతో సరసమాడాడు. చివరిగా లయన్ చిత్రంలో త్రిష, రాధిక ఆప్టేలతో సరసన మాడాడు. ఇప్పుడు కూడా అదే పంథాలో వెళుతున్నాడు. నటసింహా బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో డిక్టేటర్‌లో అంజలి మెయిన్ లీడ్. ఇక ఇప్పుడు బాపు బొమ్మ ప్రణీత కూడా నటిస్తోందని తెలుస్తోంది. మూడో నాయిక కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అసలు ఇద్దరు ముగ్గురు నాయికలతో బాలయ్య స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు ఈర్ష్య కలగకుండా ఉంటుందా? బాలయ్యా నువ్వు గ్రేటయ్యా!