'ధ‌మాకా' ఫ‌స్ట్ ఛాయిస్ మాస్ రాజా ర‌వితేజ కాదా?

Update: 2022-12-25 14:42 GMT
టాలీవుడ్ లో ఓ హీరో చేయాల‌నుకున్న‌ స్క్రిప్ట్ మ‌రో హీరో వ‌ద్ద‌కు వెళ్ల‌డం.. కొన్ని సార్లు అలా వెళ్లిన క‌థ‌లు ఫ్లాప్ కావ‌డం.. కొన్ని సార్లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా మారి స‌ద‌రు హీరోల కెరీర్ ని మ‌లుపు తిప్ప‌డం తెలిసిందే.

అయితే కొన్ని సార్లు స్టార్ హీరోలు త‌మ వ‌ద్ద‌కొచ్చిన క‌థ‌లు త‌మ‌కు పెద్ద‌గా సూట్ కావని ప‌క్క‌న పెట్టేస్తుంటారు కూడా. అలా చ‌ర‌ణ్ ప‌క్క‌న పెట్టిన క‌థే మాస్ మ‌హారాజా ర‌వితేజ వ‌ద్ద‌కు వెళ్లింద‌నే టాక్ తాజాగా వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'ధ‌మాకా'.

త్రినాథ‌రావు న‌క్కిన తెర‌కెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు. సాండ‌ల్ వుడ్ క్రేజీ గాళ్ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ స్టోరీ, డైలాగ్స్ అందించాడు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా వ‌సూళ్లని రాబ‌డుతోంది. ఫ‌స్ట్ డే ఊహించ‌ని విధంగా ఓపెనింగ్స్ ని రాబ‌ట్టిన ఈ మూవీ వీకెండ్ లోనూ అదే స్థాయి జోరుని చూపిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్సీస్ లోనూ స‌త్తా చాటుతూ భారీ స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 'ధ‌మాకా' మూవీకి క‌థ అందించిన ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ ఈ క‌థ‌ని ముందు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు వినిపించార‌ట‌. అయితే స్టోరీ అంతా లాజిక్ ల‌కు దూరంగా సినిమాటిక్ లిబ‌ర్టీతో సాగుతుండ‌టంతో చ‌ర‌ణ్ ఈ స్టోరీని రిజెక్ట్ చేశాడ‌ట‌.  

ఆ త‌రువాత ఇదే క‌థ‌ని ఇండ‌స్ట్రీలో చాలా మంది క్రేజీ హీరోల‌కు ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ వినిపించాడ‌ని, అయితే అందులో ఏ హీరో పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌లేద‌ని, ఆ త‌రువాతే ఈ స్టోరీని మాస్ మ‌హారాజా ర‌వితుజ వ‌ద్ద‌కు వెళ్లింద‌ని, త‌న‌కు బాగా న‌చ్చ‌డంతో ఫైన‌ల్ గా అదే క‌థ‌ని ర‌వితేజ‌కు వినిపించాడ‌ని త‌న‌కు న‌చ్చ‌డంతో సెట్స్ పైకి వెళ్లింద‌ని, చ‌ర‌ణ్ తో చేయాల‌నే ఇందులో 'ఇంద్ర‌' మూవీలోని స్ఫూఫ్ ని రీ క్రియేట్ చేయాల‌నుకున్నాడ‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News