'అ!' వంటి విభిన్నమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన వ్యక్తి ప్రశాంత్ వర్మ. హీరో నానిని తన కథతో ఒప్పించి నిర్మాతగా మారేలా చేయగలిగిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. విభిన్నమైన చిత్రం అంటూ మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా 'కల్కి' చిత్రాన్ని తెరకెక్కించాడు. రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.
ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ... 'అ!' చిత్రం తీయక ముందు చిరంజీవి గారికి ఒకానొక సమయంలో కథ చెప్పే అవకాశం వచ్చింది. అప్పటికి నా వద్ద చాలానే కథలు ఉన్నాయి. కాని కథలు చెప్పేందుకు నేను ప్రిపేర్ కాలేదు. కాని తెలిసిన ఒక నిర్మాత చిరంజీవి గారికి కథ చెప్పాలంటూ పంపించారు. అప్పుడు నేను భయపడి పోయాను. నా వల్ల కాదంటూ వెళ్లలేను అంటూ నిర్మాతతో అన్నారు. అయితే ఆయన చిరంజీవి గారి లాంటి స్టార్స్ కు కథ చెప్పే అవకాశం రావడం అప్పుడప్పుడు మాత్రమే వస్తుందని నన్ను ప్రోత్సహించి పంపించారు. ఏ హీరో సినిమా టికెట్ల కోసం క్యూలో నిల్చున్నానో ఇప్పుడు ఆ హీరో నా ముందు ఉన్నాడు.. ఆయనకు కథ చెప్పబోతున్నాను అనే ఆనందం. చిరంజీవి గారికి అన్నట్లుగా కాకుండా ఒక స్నేహితుడికి కథ చెబుతున్నట్లుగా నేను కథ చెప్పాను.
కథ పూర్తి అయిన తర్వాత చిరంజీవి గారు నన్ను అభినందించారు. కథ బాగా నరేట్ చేశావు అన్నారు. ఇప్పటి వరకు నాకు ఎంతో మంది కథలు చెప్పారు. అందులో బెస్ట్ గా చెప్పిన టాప్ 5 లో నువ్వు ఒక్కడివి అన్నారు. ఆ మాటలు నమ్మలేక మరోసారి అడిగాను. చాలా బాగా చెప్పావని అభినందించారు. చిరంజీవి గారికి కొన్ని వేల మంది కథలు చెప్పి ఉంటారు. అందులో బెస్ట్ 5 లో నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికి మర్చిపోలేనిదంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.