టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు ఎలా సెట్ అవుతాయో ముందే చెప్పలేం. చాలా అరుదుగా జరిగినా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ప్రేక్షకుల దృష్టిలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఈ కాంబో సెట్ అవుతుందా అని ఆశ్చర్యం కలిగించేలా దాని సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు అనిపిస్తుంది. ఇటీవలే అ! లాంటి నెక్స్ట్ జెనరేషన్ మూవీతో ప్రశంశలు అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మను చూస్తుంటే త్వరలో ఒక సర్ప్రైజ్ షాక్ ఇచ్చేలా ఉన్నాడు. అదే నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలనుకోవడం. ఇటీవలే ఒక వెబ్ ఇంటర్వ్యూ లో ఈ సంగతి వెల్లడించిన ప్రశాంత్ వర్మ బాలయ్య ను ఎలా చూపిస్తే ప్రేక్షకులు మెచ్చుతారో సరిగ్గా అలాంటి కథే తన వద్ద ఉందని చెప్పాడు. అ! తరహాలో అందులో ఎటువంటి ప్రయోగాలు చేయడట. ఆయన బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యేలా అన్ని మాస్ అంశాలను మిక్స్ చేస్తూ మంచి ఎంటర్ టైనర్ ఇస్తాను అంటున్నాడు.
ఇది కనక నిజమైతే అంత కన్నా కావలసింది ఏముంది. బాలకృష్ణ తన కెరీర్లో ఇలాంటి ప్రయోగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మాస్ హీరోగా బలంగా సెటిల్ అవుతున్న టైంలో హాస్య బ్రహ్మ జంధ్యాల గారితో 'సీతారామ కళ్యాణం' చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. మాస్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో సింగీతం శ్రీనివాసరావు గారితో 'ఆదిత్య 369, భైరవ ద్వీపం' చేసి తన కెరీర్ లో మర్చిపోలేని జ్ఞాపకాలను మిగుల్చుకున్నాడు. కె. విశ్వనాధ్ గారితో చేసిన 'జననీ జన్మభూమి' కూడా ఇదే క్యాటగిరీలోకి వస్తుంది. ఇవన్ని మంచి ఫలితాలు ఇచ్చినవి.గత ఏడాది పూరి జగన్నాధ్ కాంబో కూడా ఎవరు ఊహించనిది. ఫలితం తేడా కొట్టింది కాని లేదంటే తేడా సింగ్ హిట్టు కొట్టేవాడే.
ఇప్పుడు ప్రశాంత్ వర్మతో కనక బాలయ్య చేస్తే మటుకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. తన దగ్గర 30 కథలున్నాయని గతంలోనే చెప్పిన ప్రశాంత్ వర్మ చిరంజీవి - నాగ్ - మహేష్ బాబు ఇలా ఎవరి ఇమేజ్ కు తగ్గట్టు వాళ్ళ కోసం కథలను సిద్ధంగా ఉంచుకున్నాడట. అయితే ఇక హీరోలదే ఆలస్యం. వాళ్ళ డైరీలు ఖాళీగా లేవు కాని ఒక్క ఛాన్స్ ఇస్తే ఏదో తనలో మరో యాంగిల్ ని పరిచయం చేసేలా ఉన్నాడు ఈ అ! మేకర్.