ఈసారి ప్రొడ్యూసర్ కాదు.. ఓన్లీ హీరో

Update: 2018-03-12 04:41 GMT
కొత్త తరహా స్క్రిప్టుతో అ! సినిమా తీసి ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాదు.. ఆహా అంటూ అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఇతడు చెప్పిన కథ విని ఇంప్రెస్ అయిపోయి నాచురల్ స్టార్ నాని స్వయంగా అ! మూవీ నిర్మించాడు. చాలా లిమిటెడ్ బడ్జెట్ తో మంచి రిచ్ లుక్ వచ్చేలా సినిమా తీయడంలో నాని అండ్ ప్రశాంత్ వర్మ సూపర్ గా సక్సెసయ్యారు.

డైరెక్టర్ గా తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్న ప్రశాంత్ వర్మకు నాని మరో ఛాన్సిచ్చాడు. ఈసారి సినిమాలో నానియే హీరోగా నటించబోతున్నాడు. అసలు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందే సినిమా చేయాలని అనుకున్నారు. కానీ అ! సినిమా సక్సెస్ చూసిన తరవాత అవకాశం ఇవ్వడానికి ఓకే నాని ఓకే చెప్పేశాడట. ఈ కథలో నావెల్టీ ఉంఢటం.. నాని ఇంతవరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సబ్జెక్టుగా కొత్తగా ఉండటంతో నాని  గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది.

ప్రస్తుతం నాని కృష్ణార్జునయుద్ధం మూవీ షూటింగ్ చేస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దీనికి డైరెక్టర్. అనుపమ పరమేశ్వరన్.. అమైరా దస్తూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో నాని కెరీర్ లో రెండోసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. దీని తరవాత ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్ స్టార్టయ్యే అవకాశముంది. ఈ సినిమాను నాని ప్రొడ్యూస్ చేయడం లేదు. నానితో సినిమా తీయాలనే ఉత్సాహంతో ఉన్న నిర్మాత ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
Tags:    

Similar News