అ!..దర్శకుడి కోరిక పెద్దదే!!

Update: 2018-02-26 17:16 GMT
కొడితే సిక్స్ కొట్టాలి అని టీ20 ఫార్మాట్ లో ఇప్పటి ఆటగాళ్లు చాలా రాటు దేలుతున్నారు. అదే తరహాలో ఇండస్ట్రీకి పరిచయం ఆవుతోన్న కొత్త దర్శకులు కూడా కొడితే డిఫెరెంట్ గా బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాలి అని ప్రయోగాత్మకమైన కథలని ఎంచుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన అ! సినిమా అలాంటిదే. సినిమా ఓ వర్గం వారికే నచ్చినా కథ పరంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ నటీనటులను తెరపై చూపించిన విధానం చాలా కొత్తగా అనిపించింది.

అయితే ప్రశాంత్ కి నటీనటులను కథలో ఎలా వాడుకోవాలో బాగా తెలుసనీ కొన్ని స్పెషల్ ప్రశంసలు అందుకున్నాడు. అలాగే సినిమాను చుస్తే ఎవ్వరికైనా అర్ధమవుతుంది. అ! సినిమాలో రవితేజ ని చెట్టుగా.. నానిని చేపగా చూపించిన ఈ యువ దర్శకుడు నెక్స్ట్ ఏ హీరోతో ఎలాంటి ప్రయోగం చేస్తాడా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అసలు ప్రశాంత్ నెక్స్ట్ స్టెప్ ఏంటనే మ్యాటర్ ఇప్పుడు వైరల్ అయ్యింది. అయితే దర్శకుడి ఆలోచనలో మాత్రం ఒక పెద్ద కొరికే ఉంది.

అదే మల్టి స్టారర్. అది కూడా చిన్న హీరోలతో కాదు. ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ లెక్కలను తిరగరాసే హీరోలకే టెండర్ వేశాడు. మెగా స్టార్ చిరంజీవి - నందమూరి బాలకృష్ణ హీరోలుగా ఒకే సినిమాలో నటీస్తే బావుంటుందని తనకు కోరికగా ఉందట. అందుకే వారితో ఒక మంచి మల్టి స్టారర్ చేయాలనీ ఉందని ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. స్టార్ దర్శకులు వారితో మల్టి స్టారర్ చేయాలనీ అప్పట్లో అనుకున్నా కుదరలేదు. మరి ప్రశాంత్ అనుకున్నది సాధిస్తాడో లేదో చూడాలి.     



Tags:    

Similar News