ఎన్టీఆర్ తరువాత ప్రశాంత్ నీల్ టార్గెట్
కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా దర్శకుడుగా మారిపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ సలార్ మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఈ సినిమా పవర్ ఫుల్ మాస్ కథాంశంతో సిద్ధమవుతుంది. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు పవర్ ఫుల్ విలన్స్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరో షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 28న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
మైత్రి మూవీ మేకర్స్ లో ఆ సినిమా ఉండబోతుంది. ఎన్టీఆర్ 31వ సినిమాగా అది తెరకెక్కుతుంది. దాని తర్వాత ప్రశాంత్ నీల్ లైన్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఉన్నారు.
అయితే అంతకంటే ముందుగా కేజీఎఫ్ చాప్టర్ 3 మూవీని ప్రశాంత్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఫైనల్ అయినట్లుగా నిర్మాత విజయ్ కిరంగదూర్ గతంలో క్లారిటీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో 2025లో కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని కూడా తెలియజేశారు. దీంతో ఎన్టీఆర్ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ పూర్తిగా ఆ మూవీపై ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా సౌత్ సర్కిల్లో వినిపిస్తుంది.
మరి అంతవరకు రాకింగ్ స్టార్ యష్ మరో సినిమా చేస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సందేహం అని చెప్పాలి. వాటి తర్వాత ప్రశాంత్ నీల్ సృష్టించిన రాఖీభాయ్, సలార్ లో ప్రభాస్, ఎన్టీఅర్ 31లో తారక్ క్యారెక్టర్స్ ని కొనసాగిస్తూ భారీ మల్టీ స్టారర్ చేసే ఛాన్స్ కూడా ఉందనే మాట ఫిల్మ్ సర్కిల్ లో బలంగా వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.