బాల‌య్యను మంగోలియ‌న్ క‌థతో ఒప్పించాడా?

Update: 2023-01-16 01:30 GMT
అఖండ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఓటీటీలో స్టార్ హోస్ట్ గా అల‌రించిన బాల‌య్య త‌న కెరీర్ ఉత్త‌మ ద‌శ‌ను ఆస్వాధిస్తున్నాడు. ఈ సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన వీర‌సింహారెడ్డి భారీ ఓపెనింగుల‌ను సాధించింది. హాలిడే సీజన్లో మూవీ క‌లెక్ష‌న్స్ కి డోఖా లేకుండా ఉంద‌ని ట్రేడ్ చెబుతోంది. ఇంత‌లోనే అనిల్ రావిపూడితో యాక్షన్ చిత్రం షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. ఒంగోలియ‌న్ మంగోలియ‌న్ అంటూ బోలెడంత సంద‌డి చేస్తున్న బాల‌య్య‌ను రావిపూడి ఏవిధంగా చూపిస్తారు? అన్న‌ది వేచి చూడాలి. ఇదే గాక‌.. బాలకృష్ణ పలు క‌థ‌ల‌పై చర్చలు జ‌రుపుతున్నార‌ని తెలిసింది.

తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం ఎన్బీకే మ‌రో కొత్త క‌థను ఓకే చేశాడ‌ని తెలిసింది. యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రశాంత్ వర్మ బాలకృష్ణకు స్క్రిప్ట్ వివరించాడు. ఈ స్క్రిప్ట్ బాల‌య్య‌ను ఇంప్రెస్ చేసింది. త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ ప‌తాకంపై సుధాకర్ చెరుకూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నారు.

బాలయ్య తన ప్రస్తుత ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం లో మ‌రో పొలిటిక‌ల్ డ్రామా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు ముందు 2024 వేసవిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలిసింది. బాల‌య్య బాబు కెరీర్ లో ఎన్న‌డూ లేనంత స్వింగ్ లో ఉన్నాడు.
Tags:    

Similar News