ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత మధుర్ భండార్కర్ ను హత్య చేయించడానికి పథక రచన చేసిన ముంబై మోడల్ ప్రీతి జైన్ కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. మెకు సాయపడ్డ నరేష్ పరదేశీ, శివరామ్ దాస్ లకు కూడా మూడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. 2005లో చేసిన ఈ కుట్రలో ప్రీతి కీలక నిందితురాలు కాగా మిగతా ఇద్దరూ పథకం అమలు చేయాలనుకున్నవారు.
మధుర్ భండార్కర్, ప్రీతి మధ్య చాలాకాలంగా వివాదం ఉంది. గతంలో ఆమె భండార్కర్ పై రేప్ కేసు పెట్టింది. 2005లో మధుర్ భండార్కర్ ను హత్య చేయించేందుకు ముంబయికి చెందిన గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీ అనుచరుడు నరేష్ పరదేశీతో ప్రీతి ఒప్పందం చేసుకుని, అతనికి రూ.75 వేల రూపాయలు ఇచ్చింది. అయితే, భండార్కర్ ను హత్య చేయకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా ప్రీతి డిమాండ్ చేసింది. ఈ విషయం అరుణ్ గావ్లీకి తెలియడంతో పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేశాడు.
దీంతో, ప్రీతి, ఆమెకు సహకరించిన నరేష్, శివరామ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురూ దోషులని కోర్టులో తేలడంతో శిక్ష పడింది. కాగా, సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి తనను శారీరకంగా వాడుకున్నాడంటూ ప్రీతి 2006లో ఫిర్యాదు చేసింది. అయితే, 2012లో ఈ ఫిర్యాదును ప్రీతి ఉపసంహరించుకోవడంతో ఆ కేసును కోర్టు కొట్టివేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/