ఆమె ముద్దుసీన్లు చేస్తే వాళ్లకు అస్సలు నచ్చేది కాదట

Update: 2021-08-23 04:30 GMT
గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోయే కొందరు తారల్ని అభిమానులు ఎంత పర్సనల్ గా తీసుకుంటారో తెలిస్తే అవాక్కు అయ్యే పరిస్థితి. తెర మీద వారు ప్రదర్శించేది నటనే అయినా.. దాన్ని వారు వ్యక్తిగతంగా తీసుకోవటమే కాదు.. వారి అభిమానానికి హద్దులు పెట్టేస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులు హీరోయిన్లకు తరచూ ఎదురవుతుంటాయి. హీరోల మాదిరి.. హీరోయిన్లకు ఎల్లల్లేని స్వేచ్ఛ అంటూ ఉండదు. వారి పట్ల ఫ్యాన్స్ కు ఉండే అభిమానానికి తగ్గట్లు ఉండాల్సిన పరిస్థితి కొన్నిసార్లు తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. అలా తాను పడిన ఇబ్బంది గురించి చెప్పుకొచ్చింది నాటి అందాల భామ.. యూత్ గుండెల్లో గూడు కట్టుకున్న ప్రీతి జింగానియా.

ఆమె పేరు విన్నంతనే తమ్ముడు.. నరసింహానాయుడు సినిమాలు ఇట్టే గుర్తుకు వచ్చేస్తాయి. చలాకీగా ఉండే ఈ బబ్లీ గాళ్.. పక్కింటి అమ్మాయిలా.. మన ఇంట్లో మనకు మాత్రమే సొంతమన్న భావన కలిగించే ఉంటుంది. ఆమెపై అభిమానులకు ఉండే అభిమానం ఆమెను తెగ ఇబ్బంది పెట్టేదట. తాను సినిమాల్లో ముద్దుసీన్లు చేయటాన్ని తన అభిమానులు అస్సలు ఇష్టపడేవారు కాదని పేర్కొన్నారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

ప్రస్తుతం నిర్మాతగా మారిన ఈ నటి.. గత అనుభవాల్ని ఒకసారి గుర్తు చేసుకుంది. తనను అభిమానులు ఓన్ చేసుకోవటం బాగానే ఉన్నా.. తనను మోడ్రన్ దుస్తుల్లో చూసేందుకన్నా.. చీరలోనే చూడటానికి ఇష్టపడేవారని చెప్పింది. అంతేకాదు.. తాను ముద్దుసీన్లలో నటిస్తే.. ప్రేక్షకులకు.. అభిమానులకు నచ్చేది కాదని చెప్పింది. అయితే.. తనకు ఈ అభిమానం ఇబ్బందిగా ఉండేదని చెప్పింది. కెరీర్ లో అన్ని రకాల పాత్రలు చేయకుండా ఉండటం కష్టమేనని.. ఎవరికైనా పరిమితులు ఉంటే వారికి ఇబ్బందిగా ఉంటుందని గతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది. నటుడు పర్విన్ దాబాస్ తో పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం నిర్మాతగా మారి ఓటీటీకి చిత్రాల్ని నిర్మిస్తోంది.
Tags:    

Similar News