ఫోటో స్టొరీ: వయసు 44.. ఫిట్నెస్ 22!

Update: 2019-04-05 09:07 GMT
సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటా పేరు ఈ జనరేషన్ ప్రేక్షకులకు పరిచయం ఉండే అవకాశాలు తక్కువే కానీ 2000 నుంచి ఒక ఆరేడేళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది.  ఆ తర్వాత మెల్లగా ఛాన్సులు తగ్గిపోయాయి లెండి.  ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన  ప్రీతీ జింటా తెలుగులో కూడా రెండు సినిమాలో నటించింది.  అందులో ఒకటి వెంకటేష్ 'ప్రేమంటే ఇదేరా'.. మరొకటి మహేష్ బాబు హీరోగా పరిచయం అయిన సినిమా 'రాజకుమారుడు'.

తన బాయ్ ఫ్రెండ్ ను జీన్ గుడినఫ్ ను 2016 పెళ్లి చేసుకొని లైఫ్ లో కూడా సెట్ అయిప్యింది. ఇప్పుడు ప్రీతీ వయసు 44 ఏళ్ళు.   కానీ ఫిట్నెస్ విషయలో మాత్రం కరెక్ట్ గా సగమే.  22 ఏళ్ళ సుందరికి ఏమాత్రం తీసిపోదు. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తూ ఈ జెనరేషన్ హీరోయిన్ చేసే కఠినమైన కసరత్తులు అన్నీ చేస్తూ తన ఒంపుసొంపులను కాపాడుకుంటూ మిగతా హీరోయిన్లకు ప్రేరణగా నిలుస్తోంది.  ఈ సీనియర్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్.  రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.  తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.

జిమ్ లో తీసుకున్న ఈ ఫోటోలో ట్రాంపోలిన్ షీట్ పై జంపింగ్ జాక్ లాగా ఎగురుతూ ఉంది. కాళ్ళు చేతులూ రెండూ చాపి గాలిలో తేలుతూ ఉన్నప్పుడు తీసిన ఫోటో కావడంతో అదేదో అబ్రకదబ్ర మ్యాజిక్ లాగా ఉంది.  దీనికి 'జిమ్ లో క్లౌడ్ 9 ను టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  క్లౌడ్ 9 అంటే మేఘం నంబర్ తొమ్మిది..మేఘ మథనం చేపట్టింది అనుకుంటారేమో.. కాదు మహాప్రభో కాదు.  ఇంగ్లీష్ లో 'క్లౌడ్ 9' అంటే పిచ్చ సంతోషంగా ఉన్నాను అని అర్థం. 
Tags:    

Similar News