దాదాపు 14 ఏళ్ల క్రితం భారత్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు 14 దేశాలను బెంబేలెత్తించిన సునామీ తాలూకు చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ కొందరు మరచిపోలేదరు. డిసెంబరు 26 - 2004లో వచ్చిన సునామీ ధాటికి దాదాపు 2 లక్షల 27వేల మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ సునామీ ధాటికి లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే, నాటి సునామీ ప్రభంజనంలో బాలీవుడ్ నటి ప్రీతి జింతా కూడా మృత్యువు అంచులవరకు వెళ్లి బయటకు వచ్చిందట. ఈ విషయాన్ని తాజాగా ప్రీతి జింతా వెల్లడించింది. ఇండియా టుడే కాంక్లేవ్ ఈస్ట్ 2018 కార్యక్రమంలో పాల్గొన్న ప్రీతి ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఆ ఘటన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులను వెల్లడించింది.
2004లో థాయ్ ల్యాండ్ లో ప్రీతి జింతా...తన స్నేహితులతో కలిసి పర్యటిస్తోన్న సందర్భంలో సునామీ సంభవించింది. ఆ సమయంలో సునామీ ధాటికి గురై ఫుకెట్ లో ఉన్న ప్రీతి..ఆమె స్నేహితులు భయాందోళనలకు గురయ్యారట. నాటి సునామీ ప్రభంజనం ధాటికి ఆమె సన్నిహిత మిత్రులు కొందరు చనిపోయారట. తాను కూడా మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చిందట. ఆ దుర్ఘటనలో తానొక్కదాన్నే మిగిలానని ప్రీతి వెల్లడించింది. ఆ దుర్ఘటన తన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని, ఆ ఘటన తన జీవితంలో కీలకమైన మలుపని చెప్పింది. ఆ ఘటనే తనను ఐపీఎల్ లో ఓ జట్టును కొనుగోలు చేసేలా ప్రేరేపించిందని చెప్పింది.