పోస్ట్ రిలీజ్ కటింగులు తెలుగులో చాలా ఎక్కువ. సినిమా విడుదలయ్యాక ఏమాత్రం నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినా వెంటనే సినిమాని రీ ఎడిట్ చేస్తుంటారు. ``కావాలంటే ఇప్పుడు చూస్కోండి... కటింగులు చేశాక సినిమా చాలా బాగా వచ్చింది`` అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటారు. ఎలాగైనా ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తుంటారు. అయితే ఇలాంటి రీ ఎడిట్ ల వ్యవహారం ఫ్లాప్ సినిమాలకే కాదు, హిట్టు సినిమాలకి కూడా వర్తిస్తుంది. యాభై రోజుల తర్వాతో, వంద రోజుల తర్వాతో మా సినిమాలో అదనంగా మరికొన్ని సన్నివేశాల్ని జోడించాం అంటూ మరోసారి ప్రేక్షకుల్ని థియేటర్ కి రప్పించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ సంప్రదాయం తెలుగులో ఉన్నంతగా హిందీలో మాత్రం ఉండదు. కానీ ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాకి మాత్రం మరోసారి ఎడిటింగ్ చేశారు. కొత్త వెర్షన్ ని రేపట్నుంచి విడుదల చేయబోతున్నారు.
దీపావళిని పురస్కరించుకొని ఇటీవలే విడుదలైంది ప్రేమ్ రతన్ ధన్ పాయో. అయితే ఈ చిత్రం పాత వాసనలతోనే కూడుకొని ఉందని కొన్ని విమర్శలు వచ్చాయి. బజ్ వల్ల భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ ఆ తర్వాత నుంచి మాత్రం ఆ స్థాయిలో వసూళ్లు రాలేదు. దీనికి కారణం సినిమాకి మిక్స్ డ్ టాక్ రావడమే. అందుకే ఇప్పుడు చిత్రబృందం దిద్దుబాటు కార్యక్రమానికి పూనుకొందని తెలుస్తోంది. ఈసారి సినిమాని మరింత క్రిస్పీగా మార్చామని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మరి రీ ఎడిట్ వర్షన్ ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.