చిత్రం : 'ప్రేమకథా చిత్రమ్-2'
నటీనటులు: సుమంత్ అశ్విన్ - నందిత శ్వేత - సిద్ధి ఇద్నాని - విద్యు రామన్ - అపూర్వ శ్రీనివాసన్ - కృష్ణతేజ తదితరులు
సంగీతం: జీవన్ బాబు
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
రచన: ఉప్పునూతి గణేష్
నిర్మాత: సుదర్శన్ రెడ్డి
దర్శకత్వం: హరికిషన్
తెలుగులో హార్రర్ కామెడీ చిత్రాలకు మంచి ఊపు తెచ్చిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’. ఆరేళ్ల కిందట వచ్చిన ఆ చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు ‘ప్రేమకథా చిత్రమ్-2’ వచ్చింది. ఉగాది కానుకగా ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
సుధీర్ (సుమంత్ అశ్విన్) కాలేజీలో చదువుకుంటూనే డ్యాన్స్ స్కూల్ నడుపుతుంటాడు. అనుకోకుండా సుధీర్ ను చూసి ఇష్టపడిన బిందు (సిద్ధి ఇద్నాని) అతడి కోసమే ఆ డ్యాన్స్ స్కూల్లో చేరుతుంది. తర్వాత అతడికి ప్రపోజ్ చేస్తుంది కూడా. కానీ అప్పటికే ఇందు (నందిత శ్వేత) అనే మరో అమ్మాయిని ప్రేమించి ఉండటంతో ఆమెను కాదంటాడు సుధీర్. దీంతో బిందు ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఆపై నందుతో కలిసి ప్రశాంతంగా గడపడం కోసం సుధీర్ ఒక ఫాం హౌస్ కు వెళ్తాడు. అక్కడ అతడికి అనూహ్యమైన అనుభవాలు ఎదురవుతాయి. ఇందు దయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంది. మరి ఆమెకు నిజంగానే దయ్యం పట్టిందా.. అదే నిజమైతే ఆ దయ్యం ఇందుయేనా అన్నది తెర మీదే చూడాలి.
కథనం - విశ్లేషణ:
సరైన సినిమాలు పడక సుమంత్ అశ్విన్ కెరీర్ ఊపందుకోలేదు కానీ.. నటుడిగా అతను ప్రతిభావంతుడే. ‘అంతకుముందు ఆ తరువాత’ లాంటి సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఇక నందిత శ్వేత ఎంత మంచి నటో ఆమె నటించిన తమిళ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. తెలుగులో తొలి సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం చూసి తెలుసుకోవచ్చు. ఇంత మంచి నటులైన వీళ్లిద్దరినీ ‘ప్రేమకథా చిత్రమ్-2’లో చూస్తే జాలి కలుగుతుంది. అసలు నటనే తెలియని వాళ్లు తొలిసారి కెమెరా ముందుకు వచ్చి హావభావాలు పలికించినట్లు అనిపిస్తుంది ఇద్దరినీ చూస్తే. సన్నివేశం ఏంటో చెప్పకుండా మీకు దయ్యంతో పాటు పిచ్చి కూడా పడితే ఎలా ప్రవర్తిస్తారో.. హావభావాలు ఇవ్వండి చూద్దాం అని ఒక గంట సేపు ఒక ఇంట్లోని రకరకాల లొకేషన్లలో షాట్స్ తీసుకుని.. సన్నివేశంతో సంబంధం లేకుండా సినిమాలు అక్కడక్కడా అతికించారేమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే.
అసలు సుమంత్.. నందిత.. ఏం చూసి ఈ సినిమా ఒప్పుకున్నారో.. సినిమాలో నటిస్తున్నపుడు మధ్యలో దీన్నుంచి ఎందుకు తప్పుకోలేదో అర్థం కాదు. షార్ట్ ఫిలిం స్థాయి.. వెబ్ సిరీస్ రేంజ్ అని.. ‘ప్రేమకథా చిత్రమ్-2’ను పోల్చితే వాటిని తక్కువ చేసినట్లే అవుతుంది. అంత పేలవమైన చిత్రమిది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు కదా? అచ్చంగా అలాంటి వ్యవహారమే ‘ప్రేమకథా చిత్రమ్-2’ది కూడా. మారుతి అండ్ టీం తీసిన ‘ప్రేమకథా చిత్రమ్’కి దీనికి పేరు దగ్గర తప్ప ఏ పోలికా లేదు. కంటెంట్ పరంగా అది వంద మార్కుల్లో ఉంటే.. దీనికి పది కూడా ఇవ్వడం కష్టమే. అర్థ రహితమైన కథ.. భరించలేని కథనం.. బెంబేలెత్తించే సన్నివేశాలు.. స్థూలంగా చెప్పాలంటే ‘ప్రేమకథా చిత్రమ్-2’ వ్యవహారం ఇంతే.
ఇందులో హార్రర్ పేరుతో తీసిన సన్నివేశాల్ని చూసి నవ్వు వస్తుంది. కామెడీ కోసం చేసిన సీన్లు చూసి భయం పుడుతుంది. ఆ రకంగా చూస్తే మాత్రం ఇది ‘హార్రర్ కామెడీ’నే అవుతుంది. అసలే హార్రర్ కామెడీలకు కాలం చెల్లిపోయింది. ఈ జానర్లో మంచి సిినిమా తీసినా కూడా ఇప్పుడు ఆడే పరిస్థితి లేదు. అలాంటిది ఇంత నాసిరకంగా సినిమా తీసి.. జనాల్ని ఎలా మెప్పించాలనుకున్నారో ఏమో? ట్రైలర్ చూసి ఇంత పేలవంగా ఉందేంటి అన్నవాళ్లంతా.. సినిమా చూశాక ఇంత చెత్త సినిమాకు అంత మంచి ట్రైలర్ ఎలా కట్ చేశారో అన్న ఫీలింగ్ లోకి వెళ్లిపోతే ఆశ్చర్యమేమీ లేదు. కథ అనో.. కథనం అనో.. సన్నివేశాలనో.. ఏదో ఒకదాన్ని ఎత్తి చూపేందుకు అవకాశం లేదు. మొత్తంగా అన్నీ నాసిరకమే ఈ చిత్రంలో. ప్రథమార్ధం అని.. ద్వితీయార్ధమని.. క్లైమాక్స్ అని ప్రత్యేకంగా దేని గురించీ చర్చించే పరిస్థితి లేదు. ప్రేక్షకుల్ని హింసించడంలో ప్రతి సన్నివేశం దేనికదే పోటీ పడింది. పర్వాలేదు అనిపించే ఒక్క మూమెంట్ కూడా సినిమాలో ఎక్కడాా కనిపించదు. ఇంతకుమించి లోతుల్లోకి వెళ్లడం అనవసరం. తెలుగులో కాస్త పేరున్న నటీనటులు చేసిన సినిమాల్లో ఇంత చెత్త సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు.
నటీనటులు:
సుమంత్ అశ్విన్ ను చూస్తే నిజంగా జాలేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో దయ్యం పట్టిన వాడిగా అతడి నటన దారుణం. ఏదో ‘ఈవిల్ డెడ్’ చేస్తున్న ఫీలింగ్ తో అతను హావభావాలు పలికించే ప్రయత్నం చేశాడు. అవి చాలా కామెడీగా తయారయ్యాయి. ఇలాంటి సినిమాలు చేస్తూ కెరీర్ ఎలా పుంజుకుంటుందని అతను ఆశిస్తున్నాడో మరి. నందిత శ్వేత లాంటి మంచి నటి పెర్ఫామెన్స్ కూడా షాకింగ్ గా అనిపిస్తుంది. సినిమా ఒప్పుకున్నాక ఏదో ఒకటి చేయాలి కాబట్టి తప్పదన్నట్లు లాగించేసిందేమో అనిపిస్తుంది. సిద్ధి ఇద్నాని ఉన్నంతలో పర్వాలేదు. ఆమెకు ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం రాలేదు. కామెడీ బాధ్యత తీసుకున్న కృష్ణతేజలో మంచి ఈజ్ ఉంది కానీ.. నవ్వించలేకపోయాడు. వల్గర్ కామెడీతో విసిగించాడు. విద్యు రామన్ ను సైతం సరిగా ఉపయోగించుకోలేకపోయారు. అపూర్వ శ్రీనివాసన్.. ఇతర నటీనటుల గురించి చెప్పడానికేమీ లేదు.
సాంకేతికవర్గం:
ప్రొడక్షన్ వాల్యూస్ పేలవం. ‘ప్రేమకథా చిత్రమ్’లో చాలా వరకు ఒక ఇంట్లోనే సన్నివేశాలన్నీ లాగించేసినా.. కంటెంట్ లో ఉన్న బలం వల్ల మనకు మొనాటనీ అనిపించదు. ఇక్కడ కూడా అలాగే ట్రై చేశారు కానీ.. ఏదో బి-గ్రేడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్ లో ఇంతకంటే మెరుగ్గా ఉంటున్నాయి నిర్మాణ విలువలు. సంగీతం గురించి చెప్పడానికేమీ లేదు. నేపథ్య సంగీతం చెవుల్లో రక్తాలు కారేేలా చేస్తుంది. పాటల ప్రస్తావన అనవసరం. ఛాయాగ్రహణంలోనూ ఏ మెరుపులూ లేవు. ఉప్పుటూరి గణేష్ రైటింగ్.. హరికిషన్ డైరెక్షన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
చివరగా: ప్రేమకథా చిత్రమ్-2.. ప్రేక్షకులకు హార్రరే
రేటింగ్-0.5/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre