ఇవాళ విడుదలైన సాయి ధరం తేజ్ చిత్రలహరి ప్రీ రిలీజ్ పరంగా మంచి అంచనాలు మోసుకుంటూ థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఇందులో ఓ వీడియో సాంగ్ ని ప్రత్యేకంగా విడుదల చేసింది టీం. ప్రేమ వెన్నెల రావే ఊర్మిళ అంటూ శ్రీమణి సాహిత్యానికి దేవి శ్రీ ప్రసాద్ కట్టిన ట్యూన్ ఇప్పటికే బాగా పాపులర్ అయ్యింది.
కళ్యాణి ప్రియదర్శన్ తో ప్రేమ సందర్భంగా వచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా దీన్ని దర్శకుడు తిరుమల కిషోర్ అందమైన విజువల్స్ మధ్య షూట్ చేశారు. తేజు కళ్యాణి ఒకరికొకరు పరిచయం కావడం ఒకే చోట స్టూడెంట్స్ గా జాయిన్ కావడం ఇద్దరి మధ్యా చూపు చూపు కలవడం అంతా చాలా కూల్ గా ఉంది. డాన్స్ ఐటెం కాకపోయినా తేజు వేసిన సింపుల్ స్టెప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం లీడ్ పెయిర్ కెమిస్ట్రీని బాగా ఆవిష్కరించింది
గత కొంత కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న సాయి ధరం తేజ్ కు చిత్రలహరిలో ఉన్న ఫ్రెష్ నెస్ అనుకున్న ఫలితాన్ని ఇచ్చేలా ఉందని ఈ పాట చూసాక అనిపించక మానదు. కాస్త భిన్నంగా గెడ్డం పెంచిన తీరు కళ్యాణి ప్రియదర్శన్ సింపుల్ ఎక్స్ ప్రెషన్స్ పాటకు నిండుదనాన్ని తెచ్చాయి.
రంగస్థలం తర్వాత మైత్రి సంస్థలో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన ఆల్బం ఇదే. ఆ రకంగా కూడా అంచనాలు తోడయ్యాయి. ప్రేమ వెన్నెల రావే ఊర్మిళ అంటూ ప్రేమ గీతంతో మరిపించిన తేజు ఇంకో హీరొయిన్ నివేదాతో ఏ గీతం పాడాడో సినిమాలోనే చూడాలి మరి
Full View