తెలుగు మార్కెట్‌ ను లైట్ తీసుకున్న ప్రైమ్‌ వీడియో

Update: 2022-12-26 06:24 GMT
కరోనా ముందు వరకు ఇండియాలో ఓటీటీ మార్కెట్‌ చాలా తక్కువగా ఉండేది. ఓటీటీ ని ఇంగ్లీష్ ప్రేక్షకులు మాత్రమే ఎక్కువగా చూసేవారు. ఇండియాలో చాలా తక్కువ మంది కరోనా కు ముందు ఓటీటీలకు ఖాతాదారులుగా ఉండేవారు. బి క్లాస్ మరియు సి క్లాస్ వారికి అసలు ఓటీటీ అంటే తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారికి ఓటీటీ చేరువ అయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా సమయంలో ఓటీటీ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2020 సంవత్సరంలో ఓటీటీ ఖాతాదారుల సంఖ్య ఇండియాలో పదుల రెట్లు పెరిగినట్లుగా మార్కెట్‌ వర్గాల అంచనా. అమెజాన్ ప్రైమ్‌ మొదలుకుని పలు ఓటీటీ ల యొక్క ఖాతాదారులు పెరిగారు. ఓటీటీ లు కూడా పోటీ పడి మరీ కంటెంట్‌ ను ఇచ్చేవి.

అమెజాన్ ప్రైమ్‌ 2020 మరియు 2021 లో అత్యధికంగా తెలుగు సినిమాలను స్ట్రీమింగ్‌ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ఏడాదిలో తెలుగు సినిమా లను అమెజాన్ లైట్ తీసుకుందా అన్నట్లుగా చాలా తక్కువ సినిమాలను మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఏడాదిలో విడుదల అయిన మేటి చిత్రాల్లో ఏ ఒక్క తెలుగు సినిమా ను కూడా అమెజాన్ దక్కించుకోలేక పోయింది.

తెలుగు సినిమాలను ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెట్‌ ఫ్లిక్స్‌.. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ మరియు సొనీ లివ్‌ లు దక్కించుకుంటున్నాయి. వాటితో పాటు చిన్న సినిమాలను మరియు కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలను ఆహా ఓటీటీ వారు స్ట్రీమింగ్‌ చేసేందుకు హక్కులు కొనుగోలు చేస్తున్నారు.

సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసే విషయంలో ఇతర ఓటీటీలతో పోల్చితే అమెజాన్ వారు వెనుక పడ్డారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే వారు కావాలని సినిమాలను తీసుకోవడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. థియేటర్లు ప్రారంభం అయిన తర్వాత మళ్లీ ఓటీటీ ల యొక్క ఆధరణ తెలుగు రాష్ట్రాల్లో తగ్గిందని అందుకే అమెజాన్ కంటెంట్‌ ను తగ్గించిందని కొందరు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News