బిగ్ బాస్ లో ముద్దులు షురూ అయ్యాయ్

Update: 2017-08-03 11:21 GMT
అసలు మన తెలుగు బిగ్ బాస్ కు.. హిందీలో వచ్చే బిగ్ బాస్ కు ఉన్న ఒకేఒక్క తేడా ఏంటంటే.. అక్కడ మాట్లాడితే అమ్మాయిలు చిట్టిపొట్టి బట్టలోకి దూరిపోయి స్విమ్మింగ్ పూల్ లోకి వచ్చేస్తుంటారు. అంతే కాదు.. చాలా గొడవలు పూల్ సాక్షిగానే జరుగుతుంటాయి. ఇక కొంతమంది ప్రేమలో పడి ఆ పూల్ లోనే రొమాన్సులు గట్రా సాగిస్తుంటారు కూడా. తెలుగులో మాత్రం అవన్నీ మిస్సింగ్.

అందుకేనేమో బిగ్ బాస్ వారు తెలివిగా దీక్షా పంక్త్ అనే హీరోయిన్ ను దించేశారు. ఈమె బిగ్ బాస్ కు ఇప్పుడు కావల్సినంత గ్లామర్ తెస్తోంది. వచ్చీ రావడమే పూల్ లోకి దిగి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే నిన్న జరిగిన ఒక సీన్లో.. మరో కంటెస్టంట్ ప్రిన్స్ ఏదో అన్నాడని ఆమె హర్టయ్యింది. అతను సారీ చెప్పినా కూడా వినలేదు. మరి నన్ను ఏం చేయమంటావ్ అని ప్రిన్స్ అడిగితే.. పక్కనే ఉన్న గుంపులో జనాలు 'పప్పీ పెట్టి సారీ చెప్పు' అనగానే.. వెంటనే మనోడు ఆమె బుగ్గపై ముద్దు పెట్టేశాడు. సారీ అనేశాడు. ఆమె కూడా ఓకే అనేసింది.

ఈ దెబ్బతో బిగ్ బాస్ లో ముద్దుల వర్షం.. ఇక రేపటి నుండి వేడి వేడి సెగలు తగలే ఛాన్సులు కూడా ఉన్నట్లు అనిపిస్తోంది. మొత్తానికి స్లోగా స్టార్టయినా కూడా బిగ్ బాస్ ను రచ్చ చేస్తున్నారు కంటెస్టంట్లు. మరి రానున్న రోజుల్లో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు.. ఎవరు కొత్తగా లోపలకి రాబోతున్నారో చూడాలి.
Tags:    

Similar News