ఆయన స్టేజ్ మీద ఏడుస్తుంటే చాలా బాధేసింది: VD

Update: 2022-10-19 04:37 GMT
సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ప్రారంభించిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు కాబట్టే.. ఇతర సినిమాలకు తనవంతు సపోర్ట్ చేయడానికి వీడీ ఎప్పుడూ ముందే ఉంటాడు. సినిమా ఫంక్షన్స్ కు గెస్టుగా హాజరవుతూ మద్దతు తెలుపుతుంటారు.

లేటెస్టుగా హైదరాబాద్ లో జరిగిన 'ప్రిన్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా VD మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్స్ - ఏసియన్ సినిమాస్ తన కెరీర్‌ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయని అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ వల్ల 'పెళ్లిచూపులు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని.. సునీల్ నారంగ్ 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని జనాల వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. ఈరోజు తాను ఇక్కడ నిలబడడానికి వీరిద్దరూ కారణమని పేర్కొన్నారు.

'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎప్పుడూ అనుదీప్‌ కేవీ తీసిన ఒక షార్ట్ ఫిలిం పెట్టి కిందా మీదా పడి నవ్వేవాడు. ఎప్పుడూ అనుదీప్ గురించి మాట్లాడేవాడు. అనుదీప్ - నాగి కలిసి 'జాతి రత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ తీశారని వీడీ తెలిపారు.

తనకు అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కావడానికి అనుదీప్ ఇంటర్వ్యూలు వీడియోలు చూస్తుంటానని.. అవి చూసి చాలా ఎంజాయ్ చేస్తుంటానని విజయ్D అన్నారు. అనుదీప్ డైరెక్టర్ గా ఇలా ఇక్కడ నిలబడినందుకు.. అందరినీ నవ్విస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

అనుదీప్ తన సినిమాల ద్వారా ఎందరికో అవకాశాలు కల్పిస్తున్నారని.. అతను మరిన్ని బ్లాక్ బస్టర్స్ తీయాలని కోరుకుంటున్నానని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. థమన్ - హరీష్ శంకర్ అన్న లతో నేను వర్క్ చేయలేదు.. వారితో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానని అన్నారు.

సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస వర్క్ నాకు చాలా ఇష్టం. ఆయన పేరు ఎప్పటి నుంచో వింటున్నా కానీ.. ఎప్పుడూ చూడలేదు. చాలా సీరియస్ గా ఉంటారేమో అనుకున్నా.. ఇంత బాగా మాట్లాడే డీఓపీని నేను ఎప్పుడూ చూడలేదు అని VD పేర్కొన్నారు.

శివకార్తికేయన్ ను తానెప్పుడూ కలవలేదని.. ఇప్పుడే మొదటిసారి కలుస్తున్నానని.. అయితే అతనంటే ఎప్పటి నుంచో ఇష్టమని విజయ్ చెప్పారు. 'పెళ్లిచూపులు' రిలీజ్ అయిన తర్వాత ఒక నర్స్ యూనిఫాంలో 'రెమో' అనే సినిమా హోల్డింగులు ప్రతి దగ్గర ఉన్నాయి. ఎవరీయన అనుకున్నాను. అప్పుడే నాకు ఆయన గురించి తెలిసింది అని అన్నారు.

"అప్పటి నుంచి అతని సినిమాలు చూస్తున్నాను. నిజానికి ఆయన జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. కాలేజీ నుంచి టీవీ ఇండస్ట్రీలోకి వచ్చి.. ఐదేళ్లు అక్కడ పనిచేసి.. ధనుష్ '3' సినిమాలో క్యారెక్టర్ రోల్ చేసి.. ఆ తరవాత తనే స్టార్ అయ్యి.. ప్రొడక్షన్ కూడా చేస్తున్నాడు. అందరి సినిమాలకు లిరిక్స్ కూడా రాస్తుంటాడు"

"ఎప్పుడు చూసినా నవ్వుతూ సంతోషంగా హ్యాపీగా కనిపిస్తారు. అది నాకు నచ్చింది. అయితే ఒకసారి ఏదో ఒక స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఏడ్చారు. సినిమానే జీవితంగా భావించే మాలో ఒకడు అలా స్టేజ్ మీద ఏడుస్తుంటే చాలా బాధేసింది. మనోడు.. తన జర్నీ నాకు అర్థమైంది. తన బాధ నాకు అర్థమైంది"

"నాకు ఎందుకో అప్పటి నుంచీ ఒక బ్రదర్ ఫీలింగ్ వచ్చేసింది. ఎప్పుడైనా మనం ఏమైనా చేయగలిగితే చేయాలి.. తోడుగా ఉండాలి అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో శివ కార్తికేయన్ కోసం తన వంతుగా చిన్న సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈరోజు ఇక్కడ ఉన్నాను" విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News