'ఎవరైనా శ్రీహరి ఇంటి వద్దకు వస్తే.. కొంత డబ్బును గుడ్డలో చుట్టి విసిరేసేవాడు'
తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా హీరోగా నిర్మాతగా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నారు రియల్ స్టార్ శ్రీహరి. కొన్నేళ్ల పాటు తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దివంగత శ్రీహరి.. తన సేవాగుణంతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తన కూతురు అక్షర మృతి చెందడంతో ఆమె పేరిట అక్షర ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులను దత్తత తీసుకొని చదివించారు. అలానే కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన శ్రీహరి మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వ్యక్తిత్వం గురించి.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే సేవాగుణం గురించి ఇండస్ట్రీ జనాలు సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటారు.
తాజాగా శ్రీహరి మంచితనం గురించి ప్రముఖ కమెడియన్, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ గురించి తెలిపారు. సీనియర్ నటుడు బెనర్జీ - కమెడియన్ సుదర్శన్ - జ్యోతిలతో కలిసి సుమ హోస్ట్ చేసే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు పృథ్వీ. లేటెస్టుగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో దివంగత శ్రీహరి ని గుర్తు చేసుకున్న పృథ్వీ.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎవరైనా తన ఇంటి వద్దకు వస్తే.. కొంత డబ్బుకు రాయికి కట్టి, దాన్ని గుడ్డలో చుట్టి వారికి అందేలా రోడ్డుపైకి శ్రీహరి విసిరేసేవారని.. వాళ్ళు అది తీసుకొని చేతులెత్తి దణ్ణం పెట్టేవారని.. ఆయన కొన్ని వేల గుప్త దానాలు చేసారని పృథ్వీరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి బెనర్జీ ఎమోషనల్ మాటలు చెప్పారు.