బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిత్రం `అంధాధున్`. ఆయుష్మాన్ ఖురానా.. టబు.. రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ జాతీయ పురస్కారాన్ని సైతం దక్కించుకుని విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో `మాస్ట్రో`గా రీమేక్ చేశారు. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నభా నటేష్.. తమన్నా కీలక పాత్రల్లో నటించారు.
మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ప్రారంభం నుంచి ఈ మూవీపై మంచి అంచనాలే వున్నా మేకింగ్.. టేకింగ్ ఆసక్తిని రేకెత్తించకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గోవా నేపథ్యం.. నితిన్.. తమన్నా పాత్రలని మలిచిన తీరు సినిమాపై బజ్‌ని క్రియేట్ చేసిందే కానీ ఆ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఒరిజినల్‌లో నటించిన టబు.. రాధిక ఆప్టే పాత్రల్లో నటించిన తమన్నా.. నభా నటేష్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు.
ఈ సినిమా చూసిని చాలా మంది ఇందులో ఆత్మలేదని విమర్శలు చేశారు. తాజాగా ఇదే తరహాలో మలయాళంలో `అంధాధున్`ని `భ్రమమ్` పేరుతో రీమేక్ చేశారు. మలయాళ క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ఈ రీమేక్‌కు దర్శకుడు. రాధిక ఆప్టే పాత్రలో రాశిఖన్నా.. టబు పాత్రలో మమతా మోహన్‌దాస్ నటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు.
తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. కొత్త అప్రోచ్ తో తెలుగు రీమేక్ కు కొంత భిన్నంగా వుండటంతో పృథ్వీరాజ్ సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. అతని క్యారెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి. పియానో ప్లేయర్ గా పృథ్వీరాజ్ పాత్రని పరిచయం చేసిన తీరు బాగుంది. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ టీజర్ లో ముందుగా కీర్తిసురేష్ మదర్ మేనక నటించిన ఓ చిత్రంలోని క్లిప్ ని వాడి ఆ తరువాత పృథ్వీరాజ్ సుకుమారన్ ని అంధుడిగా పరిచయం చేయడం బాగుంది.
పైగా దీనికి దర్వకుడు కెమెరామెన్ రవి కె. చంద్రన్ కావడం మరింత ప్లస్ గా మారింది. ఒక విధంగా చెప్పాలంటే `భ్రమమ్` హిందీ.. తెలుగు వెర్షన్‌లని మించి కొత్తగా వుండటం విశేషం. టీజర్ తో తొలి టెస్ట్ పాస్ అయిన పృథ్వీరాజ్ సినిమా ద్వారా కూడా తన సత్తాని చాటుకుంటాడని అంతా భావిస్తున్నారు.
Full View