నా కన్ను పోయేలా ఉంది, నన్ను వదిలేయండి: ప్రియా వారియర్‌

Update: 2019-01-28 11:15 GMT
సంతోషం సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం మధ్య ఒక కామెడీ సీన్‌ ఉంది. ఏదో సరదాకు బ్రహ్మి కోటను పొగడుతాడు. అది నచ్చిన కోట.. దాన్ని పదే పదే రిపీట్‌ చేయమని చెప్పి బ్రహ్మికి పిచ్చెక్కిస్తాడు. అలాంటి పరిస్థితినే ప్రస్తుతం ఎదుర్కుంటూ తెగ ఇబ్బందులు పడుతుంది కన్నుగీటిన సుందరి ప్రియా వారియర్‌.

ప్రియా వారియర్‌ గురించి దేశం మొత్తం తెలుసు. కేవలం స్టైల్‌ గా కన్నుగీటి, కనుబొమలు ఎగరేసి.. ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది. జస్ట్‌ కేవలం 30 సెకన్ల ప్రోమోతో ప్రపంచం మొత్తం పాపులర్‌ అయ్యింది. అలాంటి ప్రియా వారియర్‌ కు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడికి వెళ్లినా జనాలు, సెలబ్రిటీలు కన్ను కొట్టమనే అడుగుతున్నారట. దీంతో కన్ను కొట్టి కొట్టి తన కళ్లు పోయేలా ఉన్నాయని బాధపడుతుంది. 

మొన్నటికి మొన్నలవర్స్‌ డే ఆడియో ఫంక్షన్‌ కి వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్‌ ని చూసి కన్నుకొట్టింది. తన సిగ్నేచర్‌ మూమెంట్‌ తో అందర్ని అలరించింది. సెలబ్రిటీలు కాబట్టి.. తన సినిమా ఆడియో పంక్షన్‌ కాబట్టి తప్పదు. కానీ ఎక్కడికి వెళ్లినా ఇలా కన్ను కొట్టమని జనాలు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. దీంతో.. ప్రియా వారియర్‌ కు కోపం వచ్చింది. ఇప్పటికే 200 సార్లు కన్ను కొట్టి ఉంటాను. ఇంక నన్ను వదిలెయ్యండి అంటూ బ్రతిమిలాడుకుంటోంది. పాపం ప్రియా పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు మరి.
Tags:    

Similar News