ఆడిషన్స్ లో హాస్యనటుడిగా అవమానం.. ఆ తర్వాత ఏమైంది?

Update: 2022-10-26 09:30 GMT
టాలీవుడ్లోని యువ హాస్య నటుల్లో ప్రియదర్శి ఒకరు. 'టెర్రర్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ నటుడు కొద్దికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పెళ్లి చూపులు' సినిమాలో ప్రియదర్శి కామెడీ టైమింగ్ సూపర్బ్ గా ఉంటుంది. 'నా చావు నేను చస్తా నీకెందుకు' అనే డైలాగుతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

'పెళ్లిచూపులు' సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా సైమా.. ఐఫా అవార్డులను సైతం గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రియదర్శికి టాలీవుడ్లో వరుస ఆఫర్లు దక్కాయి. 'ది ఘాజి అటాక్'.. 'జై లవకుశ'.. 'అర్జున్ రెడ్డి'.. 'జాతిరత్నాలు'.. 'మల్లేశం'.. 'రాధేశ్యామ్'.. 'సీతారామం'.. 'ఒకే ఒక జీవితం' సినిమాల్లో నటించాడు.

హాస్యనటుడిగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రియదర్శి ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. 'మల్లేశం' సినిమాలో ప్రియదర్శి లీడ్ చేసి ఆకట్టుకున్నాడు. సినిమాలతోపాటు పలు వెబ్ సిరీసుల్లో నటిస్తూ ప్రియదర్శిని బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శి ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు సంఘటనలను అందరితో పంచుకున్నాడు.

సినిమాటోగ్రఫర్ అవుతానని చెప్పి ఇంట్లో నుంచి వచ్చానని తెలిపాడు. కానీ ఇక్కడ నటుడిగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో దారుణమైన అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయాడు. ఆడిషన్స్ చేస్తున్న సమయంలో తనను నల్లగా .. సన్నగా ఉన్నావని ఎద్దేవా చేసేవారని.. ఒక్కోసారి హీరో కంటే పొడుగ్గా ఉన్నావంటూ రిజక్ట్ చేసేవారని ప్రియదర్శి తెలిపాడు.

అయితే వీటన్నింటిని కూడా తాను ఎప్పుడూ పట్టించుకోలేదన్నాడు. ఇలాంటి సమయంలోనే 'టెర్రర్' మూవీలో నటించే అవకాశం లభించిందని తెలిపాడు.

ఆ పాత్రకు తానే సరిపోతానని ఆడియన్స్ చేసినవారే ఫోన్ చేసి చెప్పారని.. అలా తాను ఇండస్ట్రీలోకి వచ్చానని ప్రియదర్శి వెల్లడించారు. అలా అప్పుడు అవమానాలకు గురైన ప్రియదర్శి ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బీజీబీజీగా గడుపుతున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News