హీరోయిన్ ప్రియమణి తెలుగు తెరపై కనిపించి చాలా రోజులే అయింది. ఒక టైంలో టాప్ హీరోయిన్ స్టేజ్ కు వెళ్లిన ఈ బ్యూటీ ఆ స్టార్ డమ్ ను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో ఓ టీవీ షో జడ్జిగా మాత్రం చేస్తోంది. తమిళం.. మళయాళంలో అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. ఉన్నట్టుండి ప్రియమణి హీరోయిన్ గా అంగుళీక అనే సినిమా వస్తోందంటూ పోస్టర్లు బయటకు వచ్చాయి. దానిని చూసి ప్రియమణికి తెగ కోపమొచ్చేసింది.
చాలాకాలం తరవాత సినిమా రిలీజవుతుంటే హ్యాపీగా ఉండాలి కానీ.. కోపమెందుకని డౌటొచ్చిందా. అసలు ఈ మూవీలో ప్రియమణి నటించనేలేదు. ఈ సినిమా స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ప్రియమణినే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. ఈ రోల్ చేయడానికి ఆమె కూడా ఓకే చెప్పింది. కానీ తరవాత ఈ ప్రాజెక్టు నుంచి బయటకొచ్చేసింది. వేరే హీరోయిన్ తో సినిమా తీసిన చిత్ర యూనిట్ సినిమా పోస్టర్ మాత్రం ప్రియమణిదే ఉంచారు. దీంతో ఆమెకు కోపమొచ్చి ఈ మూవీ యూనిట్ పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు కంప్లయింట్ చేసింది.
తాను ఆ సినిమా చేయకపోయినా తన ఫొటో పెట్టి తన పేరు వాడుకున్నందుకు అంగుళీక సినిమా టీం తనకు కాంపన్సేషన్ ఇవ్వాలంటూ మా వాళ్లకు ఇచ్చిన కంప్లయింట్ లో కోరింది. ఈ వివాదంపై సినిమా టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. రాకరాక ఇన్నాళ్లకు ప్రియమణి సినిమా వస్తోందని అనుకున్నా.. అదంతా ఉత్తుత్తిదే అన్నమాట. ప్చ్.