సినీ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిన క్లాసిక్ లను ముట్టుకోకపోవడం మంచిదని అంటారు ఎవ్వరైనా. ఒక పాత సినిమా టైటిల్ వాడుకుందామన్నా.. ఏ సినిమానైనా రీమేక్ చేద్దామని చూసినా.. చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ‘మాయా బజార్’.. ‘శంకరాభరణం’ లాంటి టైటిళ్లతో వచ్చిన సినిమాలు ఏమయ్యాయో తెలిసిందే. ‘మరో చరిత్ర’ సహా చాలా క్లాసిక్ ల రీమేక్స్ కూడా తేడా కొట్టేశాయి. అయినా కూడా జనాల్లో మార్పు రావట్లేదు. పాత టైటిళ్లను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇంకో క్లాసిక్ మీద కన్నేసింది ఒక చిత్ర బృందం. అదే.. సిరివెన్నెల. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిరివెన్నెల’ ఎంత గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుందో తెలిసిందే. ఇప్పుడు చూసినా గొప్ప అనుభూతిని కలిగించే చిత్రమది.
ఇప్పుడు ఆ టైటిల్ తో కొత్తగా ఓ సినిమా తీస్తున్నారు. చాలా ఏళ్ల కిందటే కెరీర్ ముగిసిన ప్రియమణి ఈ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. ఒక నాలుగైదేళ్లు టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన ప్రియ.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో వెనుకబడింది. కొన్నేళ్ల కిందటే ఆమె అడ్రస్ గల్లంతయిందిక్కడ. వేరే భాషల్లోనూ అవకాశాలు ఆగిపోయాక తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడిందామె. తర్వాత ఏవో టీవీ షోల్లో కనిపిస్తూ కాలక్షేపం చేస్తున్న ప్రియమణి.. ఇన్నేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనుందట. కొంచెం గ్లామర్ ఉండగానే ఆమెనెవ్వరూ పట్టించుకోలేదు. అలాంటిది ఇన్నేళ్ల విరామం తర్వాత సాధారణమైన లుక్ తో వస్తే ఎవరికి ఆసక్తి ఉంటుంది. ఈ సినిమాకు కుదిరిన కాంబినేషనే జనాలకు ఏమాత్రం ఆసక్తి రేకెత్తించట్లేదు. ఎవరో చిన్న స్థాయి వాళ్లు చేస్తున్న ఛోటా సినిమా ఇది. దీనికి ‘సిరివెన్నెల’ లాంటి మంచి టైటిల్ వాడుకోవడం ఆ చిత్ర అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది