ప్రియాంక అరుళ్ మోహన్ అనగానే .. చేపలాంటి కళ్లు .. చెర్రీ పండ్లలాంటి పెదాలు .. సన్నజాజిలాంటి నాసిక .. మాయ చేసినట్టుగా అనిపించే మందహాసం కళ్లముందు కదలాడతాయి. అద్దం మురిసిపోయే అందం .. అబ్బాయిలంతా అద్దంగా మారాలనే అందం ఆమె సొంతం. అలాంటి ప్రియాంక 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. తెరపై ఈ అమ్మాయిని చూడగానే .. ఎక్కువ రంగులు వాడకుండా బ్రహ్మదేవుడు చాలా సింపుల్ గా ఈ అమ్మాయి బొమ్మను గీశాడని అనుకున్నారు.
అలాంటి ఈ అమ్మాయి ఇప్పుడు శర్వానంద్ జోడీగా 'శ్రీకారం' సినిమా చేసింది. ఈ నెల 11వ తేదీన .. 'మహాశివరాత్రి' సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ .. "నేను పుట్టిపెరిగింది బెంగుళూరులో .. మా నాన్నగారు తమిళియన్. అందువలన నాకు కన్నడ .. తమిళ రెండు భాషలు బాగానే వచ్చు. ఇక తెలుగులో అవకాశాలు వస్తుండటం కూడా ఆనందాన్ని కలిగిస్తోన్న విషయం. తమిళంలో సూర్య .. శివకార్తికేయన్ లతో చేస్తున్నాను. అక్కడ ఇంకా వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
ఒక సినిమా ఒప్పుకోవాలంటే నేను చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుంటాను. కథ .. కథనం .. నా పాత్ర .. అందులో ఎంతవరకూ కొత్తదనం ఉంది? .. అది నా బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతుందా లేదా? అది ఎంతవరకూ ఆడియన్స్ కు రీచ్ అవుతుంది? .. హీరో ఎవరు? .. బ్యానర్ ఏమిటి? .. దర్శకుడు ఎవరు? ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటాను. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ ను సాధించాలంటే ఇవన్నీ కూడా సక్రమంగా నడవాలి. అందువలన ఈ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. వీటిలో ఏ విషయంలో అసంతృప్తి అనిపించినా చేయను. తెలుగులో చిరంజీవి .. తమిళంలో రజనీ అంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చింది. యంగ్ హీరోల పేర్లు చెప్పలేదు కాబట్టి, పిల్ల తెలివైందేనని అనుకోవాలి.