నేనంటే ఇష్టం.. కాని తీసుకోలేదు

Update: 2017-04-27 04:43 GMT
సెక్సిణి ప్రియాంకా చోప్రా ఇప్పుడు ముంబైలో ఉంది. మొన్నే వచ్చింది.. అప్పుడే తన జెండా ఎగరివేసింది. హాలీవుడ్ సినిమా బేవాచ్  కోసం ముంబై వదిలివెళ్ళి దిగ్విజంగా పూర్తి చేసుకొని తిరిగొచ్చి... ఇలా అడుగు పెట్టిందో లేదో టాక్ ఆఫ్ టౌన్ అయింది.

సంజయ్ లీల భాన్సాలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ''పద్మావతి''లో ఈమె ఒక రోల్ చేస్తోందని రూమర్లు వచ్చాయి. ఇందులో నిజముందా? అదే విషయం అడిగితే.. 'నేను సంజయ్ సర్ కి ఇష్టమైన నటిని ఐతే నన్ను కాస్ట్ చేస్తారా? అలా ఏమి లేదు. మేము వేరే సినిమా కోసం మాట్లాడుకున్నాం' అని మరో కొత్త సినిమాకు తెర తీసింది. ప్రియాంకా ఇప్పటికే కథలు వినడం మొదలుపెట్టింది అని అందులో ఓ మూడు సినిమాలకు ఓకే చెప్పింది అని తెలుస్తుంది. కాకపోతే అందులో పద్మావతి మాత్రం లేదు అని తేలిపోయింది. సంజయ్ తో మాటలు బట్టి అతను మరో కళాఖండంకి శ్రీకారం చుడుతున్నట్లు అర్ధమవుతోంది. అలాగే కల్పనా చావ్లా బయోపిక్ లో అమ్మడు నటిస్తోందని మనకు తెలిసిందే.

ప్రియాంకా ఇప్పుడు తన హాలీవుడ్ సినిమా బేవాచ్ ప్రమోషన్ లో చాలా బిజీ గా ఉంది. మే 25 న విడుదల అవుతుంది. మరి హాలీవుడ్ లో తొలి సక్సెస్ కొడుతుందో లేదో చూడాలి అంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News