ప్రియాంకను కారులోంచి నెట్టేసిన నటుడు

Update: 2017-11-18 17:21 GMT
ఐశ్వర్య రాయ్ తర్వాత హాలీవుడ్ లో ఏ ఇండియన్ నటి కూడా హాలీవుడ్ వైపు చూసి అంతగా అటెన్షన్ పొందలేకపోయింది. కానీ డస్కీ బ్యూటి ప్రియాంక చోప్రా మాత్రం తనదైన శైలిలో అక్కడ సినిమాలను చేస్తూ అలరిస్తోంది. అంతే కాకుండా టీవీ సిరీస్‌ లలో హాట్ గా నటిస్తూ అమెరికన్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో ఉన్నప్పుడే తన అందాలతో రచ్చ చేసినా ఈ సెక్సీ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ లో అన్ని హద్దులు దాటేసింది.

హాలీవుడ్ ప్రముఖ నటులతో చాలా క్లోజ్ గా కూడా ఉంటోంది. అయితే రీసెంట్ గా విడుదలైన అమ్మడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. అయితే ప్రయాణిస్తున్న కారులో ఆమె సహా నటుడు తో ఉన్న ప్రియాంక అతనితో గోడవపడుతున్నట్లు అలాగే అతను ఆమెను కిందకు నెట్టివేయడం అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అయితే అమ్మడు అసలు కింద పడింది గాని నడుస్తున్న కారులో నుంచి కాదులే. అవతలి వైపు ఒక స్క్రీన్ అమర్చి ఉంది. షూటింగ్ కోసం వేసిన సెట్స్ లో తన సహచర నటుడైన రస్సెల్‌ టోవీతో ప్రియాంక ఇలా చిలిపి చేష్టలు చేసి ఒక్క క్షణం అందరిని పిచ్చోళ్లను చేసేసింది.       

ఈజింట్ ఇట్ రొమాంటిక్ సినిమాలో నటిస్తున్న ప్రియాంక.. ఆ సినిమాతో అమెరికన్ ఆడియన్స్ ను పూర్తి స్థాయిలో ఎట్రాక్ట్ చేయాలని చూస్తోంది. అది సంగతి.

Full View
Tags:    

Similar News