బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా సింగర్ కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడాక తన బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరిగింది. అమెరికా కోడలుగా పాపులరయ్యాక అటు వరుసగా హాలీవుడ్ వెబ్ సిరీస్ లు.. సినిమాలకు సంతకాలు చేస్తూ నిరంతరం హాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పీసీ వ్యవహారం చూస్తుంటే ముంబై పరిశ్రమను పూర్తిగా లైట్ తీస్కున్నట్టే కనిపిస్తోంది.
ప్రస్తుతానికి భర్త నిక్ తో కలిసి అమెరికాలోనే నివాసం ఉంటోంది. అత్తమామలకు సేవలు చేస్తూ భర్తతో సంసార సాగరాన్ని ఈదుతోంది. అయితే ఈ జంటకు సంపాదన ఎలా? అంటే నిక్ ఇప్పటికే పాపులర్ నటుడిగా గాయకుడిగా బాగానే ఆర్జిస్తున్నాడు. ఇటీవల పెరిగిన బ్రాండ్ వ్యాల్యూని ఉపయోగించి సంపాదనలోనూ రాటుదేలింది పీసీ. ఆ ఇద్దరికీ ఆదాయం పరమైన సమస్యలేవీ లేవు. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్పొరెట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా ప్రియానిక్ జంట బాగానే సంపాదిస్తోంది. తాజాగా పీసీ ఖాతాలో మరో కొత్త బ్రాండ్ చేరింది.
లాస్ ఏంజెల్స్ కి చెందిన ప్రఖ్యాత బోన్ వివ్ (స్పైక్డ్ సెల్టర్) బ్రాండ్ కి ప్రయాంక చోప్రా క్రియేటివ్ అడ్వైజర్ గా ఎంపికైంది. పెయిడ్ పార్టనర్ గానూ కొనసాగుతున్నానని స్వయంగా వెల్లడించింది. ఇదే విషయాన్ని పీసీ ఇన్ స్టాలో చెబుతూ చీరప్ మూవ్ మెంట్ ని షేర్ చేసుకుంది ``ఈ అవకాశం నన్ను థ్రిల్ కి గురి చేసింది. ఈరోజు ఛీర్స్ చేసుకునే కాల్ రిసీవ్ చేసుకున్నా. బాన్ వివ్ బ్రాండ్ పెయిడ్ భాగస్వామిగా చేరాను. తాజాగా బాన్ వివ్ సమ్మర్ బ్రంచ్ బాక్స్ ని అందుకున్నా`` అంటూ ఛీర్ చేసింది. బాన్ వివ్ అనేది బయో ప్రొడక్ట్.. ఇదో పండ్ల రసాలకు సంబంధించిన కంపెనీ. ద్రాక్షరసం సహా పలు రకాల ఉత్పత్తుల్ని అందిస్తుంది.