52 వారాలు, 500 సినిమాలు... ఏడుపెందుకు?

Update: 2016-01-01 07:32 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బ్రిలియన్సీ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అసాధార‌ణ ప్ర‌జ్ఞా పాట‌వాల‌తో పాటు, అద్భుత‌మైన వాక్చాతుర్యం - టైమింగ్ సెన్స్ ఈ అమ్మ‌డికి ఉంది. అందుకే బాలీవుడ్‌ ని ఏల్తోంది. వేదిక‌ల‌పై ఈ అమ్మ‌డు మాట్లాడే తీరుతెన్నులు ఆల్వేస్ హాట్ టాపిక్‌. లేటెస్టుగా ఈ భామ న‌టించిన భాజీరావ్ మ‌స్తానీ విజ‌య‌ప‌థంలో దూసుకుపోతోంది.

అయితే బాద్‌ షా షారూక్‌ ఖాన్ సినిమా దిల్‌ వాలేతో పాటు పోటీకి దిగ‌డంపై మీడియాలో ర‌క‌రకాల క‌థ‌నాలొచ్చాయి. దిల్ వాలేతో పోటీప‌డి చ‌తికిల‌బ‌డింద‌న్న రివ్యూలు కూడా ఆరంభం వ‌చ్చాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు భాజీరావ్ లాంగ్‌ ర‌న్‌ లో అద‌ర‌గొట్టేస్తున్నాడు.  అయినా ఇలాంటి పోటీ ఎందుకు పెడ‌తారు?  సంవ‌త్స‌రంలో 52 వారాలున్నాయ్‌, 500 సినిమాలు రిలీజ‌వుతున్నాయ్‌. ఏ రెండు సినిమాల మ‌ధ్య క్లాషెస్ ఉండ‌కూడ‌దు అనే మాట ఎందుకు వ‌స్తోంది? అయినా నేను ఓ విష‌యాన్ని అర్థం చేసుకోలేక‌పోతున్నా. మా మ‌ధ్య క్లాషెస్ అంటూ ఎందుకు అన‌వ‌స‌ర ప్ర‌చారం చేస్తారు? అయినా ఇలా కాకుండా వారం గ్యాప్‌ తో నో లేక వారం పాటు వాయిదా వేసుకుంటేనో మీకు సంతోషంగా ఉంటుందా? అంటూ ప్ర‌శ్నించింది పీసీ.

నిజ‌మే ప్రియాంక ఆవేద‌న‌లో అర్థం ఉంది. ఏవైనా రెండు సినిమాలు ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డితే త‌ప్పేంటి?  క్లాషెస్ అంటూ టీఆర్‌ పీల కోసం ఆటాడుకునే మీడియాకి ఆమాత్రం నైతిక‌త ఉండ‌దా? అని ప్ర‌శ్నించ‌డంలోనూ ఓ సెన్స్ క‌నిపిస్తోంది. నైస్ పీసీ. నైస్ క్వ‌శ్చ‌న్స్‌.

Tags:    

Similar News