ఈ మధ్య టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయిందో.. ఆ ఉదంతం నేపథ్యంలో ప్రియాంక చోప్రా మాజీ మేనేజర్ ప్రకాష్ వ్యాఖ్యలు కూడా అంతే హట్ టాపిక్ అయ్యాయి. ప్రియాంక చోప్రా కూడా చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని.. ఐతే తానే ఆమెను కాపాడానని ప్రకాష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రియాంక తల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
ఇప్పుడు ప్రియాంక సైతం ఆ వ్యాఖ్యలపై మండి పడింది. ప్రకాష్ పేరెత్తకుండా అతనో పనికి మాలిన వాడని వ్యాఖ్యానించింది. ‘‘పనిలేని వారి మాటల గురించి పట్టించుకునే అవసరం.. తీరికా నాకు లేవు. చేయడానికి ఏ పనీ లేనప్పుడే అలాంటి మాటలు పుట్టుకొస్తుంటాయి. ఇతరులు సాధించిన విజయాలను కూడా తమవిగా చెప్పుకునే మనిషి అతను. ఆ మనిషికి నేను ఎప్పుడో బుద్ధి చెప్పాను. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదో నా గురించి కొత్తగా చెబుతానంటే ఎవరూ అతని మాటలు నమ్మరు’’ అని ప్రియాంక చెప్పింది.
ఇక ప్రత్యూష ఆత్మహత్య ఉదంతం గురించి ప్రియాంక స్పందిస్తూ.. ‘‘ఆ విషయం తెలిసి చాలా బాగా బాధపడ్డాను. ఈ మధ్య కాలంలో నన్ను తీవ్రంగా కలచివేసిన ఘటన అది. ప్రేమలో ఓడిపోయినా.. ఆర్థిక ఇబ్బందులున్నా.. దేనికీ ఆత్మహత్య పరిష్కారం కాదు. ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల గురించి నాకు తెలియదు. వాటి గురించి మాట్లాడడం సబబు కాదు కూడా. ఒక్క ప్రత్యూష ఆత్మహత్యనే కాదు. అమ్మాయిల ఆత్మహత్యలను వేటినీ నేను సమర్థించను. జనాలు ప్రత్యూష గురించి మాట్లాడుకున్న మాటలు చాలా బాధ కలిగించాయి. యాక్టర్స్ కూడా మనుషులే.. వాళ్లకు కూడా భావోద్వేగాలు ఉంటాయని గుర్తించాలి. అవేమీ పట్టించుకోకుండా అవమానకరంగా మాట్లాడుతుంటే భరించలేను. మనుషులు సినిమా, టీవీ యాక్టర్ల గురించే మాట్లాడుకోనక్కర్లేదు. లోకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడితే కొన్నింటికైనా పరిష్కారం లభించొచ్చు’’ అని ప్రియాంక చెప్పింది.