ఫోటో స్టోరి: బజార్ అందాలు బాగున్నాయే

Update: 2018-01-31 11:54 GMT
గతంలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి షిఫ్ట్ అయినా హీరోయిన్స్ అనుకున్నంత రేంజ్ లో ఎక్కువగా క్రేజ్ ను తెచ్చుకోలేదు. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కొన్ని సినిమాలు చేసినా ఓ లిమిట్ వరకే క్రేజ్ అందుకుంది. కానీ ప్రస్తుత జనరేషన్ కి మంచి స్ఫూర్తిని ఇచ్చేలా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ తెరపై తన సత్తాను చాటుతోంది. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా తన ఘాటు అందాల గురించి ప్రపంచం అంతా మాట్లాడుకునేలా చేస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే ప్రియాంక మ్యాగజైన్ లలో కూడా నెలకొక సారి కనిపిస్తూనే ఉటుంది. అయితే ఎన్ని సార్లు అలా కనిపించినా కూడా చాలా కొత్తగా కనిపించడం ఆమెకు అలవాటే. రీసెంట్ గా ఇంటర్నేషనల్ బజార్ కవర్ పేజ్ పై కూడా హాట్ బ్యూటీ అందాలు సరికొత్తగా మెరిశాయి. అలాగే వైట్ బ్లాక్ బ్లూ కాంబినేషన్ డ్రెస్లో అమ్మడు చాలా హాటుగా పోజివ్వడం చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈ ఫొటోను చూస్తేనే అర్ధమవుతోంది దీపికా ప్రతి అడుగులో కొత్త ధనం కోరుకుంటోందని.

ఇక ఫైనల్ గా బజార్ మ్యాగజైన్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. హాలీవుడ్ టెస్ట్ తగిలితే ఇలానే ఉంటుందేమో అని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు హాలీవుడ్ బజార్ అందాలు బావున్నాయో అని పాజిటివ్ గా చమత్కారాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ లో ఒక సీరియల్ లో అలాగే రెండు సినిమాల్లో నటిస్తోంది.   
Tags:    

Similar News