ట్యాక్సీవాలా తర్వాత రవితేజ నిర్ణయంలో మార్పు

Update: 2018-11-27 05:20 GMT
రవితేజ వరుసగా ‘టచ్‌ చేసి చూడు’ - ‘నేల టికెట్టు’ - ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాల ఫ్లాప్‌ తో దిగులు చెందుతున్నాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేస్తున్న మూవీని ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకున్నాడు. ఇక రవితేజ ఇప్పటికే వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యాడు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు.

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రం ఫలితంతో స్క్రిప్ట్‌ లో చిన్న చిన్న మార్పులతో పాటు - హీరోయిన్‌ మార్పు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. మొదట ఈ చిత్రం కోసం పాయల్‌ రాజ్‌ పూత్‌ మరియు నభా నటేష్‌ లను ఎంపిక చేయడం జరిగింది. నన్ను దోచుకుందువటే చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ముద్దుగుమ్మ నభా నటేష్‌ కు తన సినిమాలో రవితేజ ఛాన్స్‌ ఇచ్చాడు. అయితే ట్యాక్సీవాలా చిత్రం విడుదల తర్వాత తన నిర్ణయంను మార్చుకున్నాడని తెలుస్తోంది. ట్యాక్సీవాలా చిత్ర హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ కు తన సినిమాలో ఛాన్స్‌ ఇవ్వాలని రవితేజ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ట్యాక్సీవాలా చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రియాంక జవాల్కర్‌ కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. సక్సెస్‌ తో ఎంట్రీ ఇచ్చి లక్కీ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమెను తమ సినిమాలో ఎంపిక చేసేందుకు చర్చు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఆ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రియాంక జవాల్కర్‌ కు ఇంకా పలు చిత్రాల్లో నటించే అవకాశాలు కూడా దక్కుతున్నాయట.

Tags:    

Similar News