బిగ్ బాస్ ఈ సీజన్ లో ప్రత్యేక కంటెస్టెంట్ గా నిలిచిన ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ హౌస్ లో అందరితో చాలా కలివిడిగా మాట్లాడుతూ అందరితో కలిసి పోతూ ఉంది. అక్క అన్న తమ్ముడు అంటూ అందరిని వరుసలతో పిలుస్తున్న ప్రియాంక ఒక్క మానస్ ను మాత్రం పేరు పెట్టి పిలుస్తుంది. ఆ విషయమై రవి నిన్నటి ఎపిసోడ్ లో మాట్లాడుతూ నన్ను రవి అన్న అని పిలుస్తున్నావు ఇతరులను అన్న లేదా తమ్ముడు అంటున్నావు కాని మానస్ ను మాత్రం పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో ప్రియాంక సిగ్గు పడుతూ మానస్ ను నేను పేరు పెట్టి పిలవాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఎందుకంటే మానస్ ను అన్న లేదా తమ్ముడు అనాలని లేదు అంటూ మరింత సిగ్గు పడింది.
ఆ సమయంలో అక్కడున్న వారు అంతా కూడా గట్టిగా అరుస్తూ ఎటో వెళ్లి పోయింది మనసు అంటూ పాట అందుకున్నారు. అక్కడే ఉన్న మానస్ మాత్రం ఈ విషయంలో స్పందించకుండా నవ్వుతూ ఉండి పోయాడు. బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ లు చాలా కామన్ విషయం. ఎంతో మంది గతంలో లవ్ ట్రాక్ నడిపించారు. లవ్ ట్రాక్ నడపడం వల్ల ఎక్కువ రోజులు ఉన్న వారు ఉన్నారు... ఏకంగా ట్రోఫీని దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అందుకే బిగ్ బాస్ లో ఉన్నంత కాలం అయినా డ్రామాగా లవ్ ట్రాక్ ను నడిపించడం బెటర్ అన్నట్లుగా కొందరు భావిస్తూ ఉంటారు. అందుకే బిగ్ బాస్ లో ఉన్న సమయంలో చాలా మంది కంటెంట్ కోసం కాస్త పులిహోర కలుపుతున్నట్లుగా మాట్లాడటం లేదంటే మరో రకంగా మాట్లాడటం చేస్తూ ఉంటారు.
బిగ్ బాస్ సీజన్ 5 లో లవ్ ట్రాక్ లను నడిపేందుకు అమ్మాయిలు బాగనే ఉన్నాయి. అబ్బాయిలు కూడా అందుకు ఇంట్రెస్ట్ తో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు కాకున్నా రాబోయే వారాల్లో అయినా లవ్ ట్రాక్ మొదలు అవ్వడం ఖాయం అనుకుంటూ ఉన్న సమయంలో అనూహ్యంగా ప్రియాంక సింగ్ నుండి వస్తున్న సిగ్నల్ నేపథ్యంలో మానస్ కు లవ్ ట్రాక్ పడబోతుంది అనే టాక్ మొదలు అయ్యింది. ట్రాన్స్ జెండర్ అవ్వడం వల్ల ఈ లవ్ ట్రాక్ కు మరింతగా ఆకర్షణ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. బిగ్ బాస్ టీమ్ నుండి ఈ లవ్ ట్రాక్ కు మద్దతు లభిస్తే ఇది ఖచ్చితంగా షో వరకు అయినా ముందుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు అంటూ ప్రచారం జరుగుతోంది. రవి లాంటి వారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి లవ్ ట్రాక్ లు ముందు ముందు చాలానే బయట పడుతాయి. బయట పడకుంటే ఆయన లాక్కుని వచ్చే రకం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.