కరోనా వల్ల వాయిదా పడ్డ సినిమాలు మార్చి నుండి మొదలుకుని మే నెల వరకు కంటిన్యూస్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కరోనా కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. ఫిబ్రవరి నెలలో డేంజర్ బెల్స్ అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా మార్చి నుండి కుమ్మేస్తాం అంటూ పెద్ద సినిమాలను మొదలుకుని మీడియం రేంజ్ సినిమాల వరకు క్యూ కట్టాయి. పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో క్లాష్ కాకుండా ఉండేందుకు అన్ని చిత్రాల నిర్మాతలు చర్చలు జరుపుకుని పెద్ద సినిమాలకు కాస్త ఎక్కువ గ్యాప్... మీడియం రేంజ్ సినిమాలకు తక్కువ గ్యాప్ అన్నట్లుగా సినిమాలను విడుదల చేసుకునేందుకు డేట్లు కుదుర్చుకోవడం జరిగింది. ఈ హడావుడిలో ప్రతి ఒక్క సినిమా విడుదల తేదీ కూడా ఇంకా గందరగోళం అన్నట్లుగానే ఉంది. కొన్ని సినిమాలు రెండు విడుదల తేదీలను ప్రకటించగా కొన్ని సినిమాల విడుదల తేదీలో ఇతర పెద్ద సినిమాలతో క్లాష్ అవుతున్నాయి.
రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమా ను ఈ నెలలో విడుదల చేయబోతున్నారు. ఈ నెలలో సినిమాల జాతర మొదలు అవ్వడం లేదు. కనుక సేఫ్ రిలీజ్.. రిస్క్ లేని రిలీజ్ ఖిలాడికి దక్కింది. ఖిలాడి విడుదల విషయంలో ఎలాంటి సమస్య లేదు కాని అదే రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు మాత్రం చాలా పెద్ద సమస్య తప్పడం లేదు. షూటింగ్ పూర్తి చేసుకుని కొన్ని వారాలే అయినా అప్పుడే ఈ సినిమాకు మూడు నాలుగు డేట్లు మార్చారు. ఇప్పుడు ఈ సినిమా కు రెండు డేట్లను ఖరారు చేస్తూ సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. అయితే రెండు తేదీలు కూడా చాలా కష్టమైన తేదీలే అవ్వడంతో ఇప్పుడు రవితేజ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి తేదీ మార్చి 25వ తారీకు. ఇప్పటికే ఆ తేదీన ఆర్ ఆర్ ఆర్ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఒక వేళ ఆ తేదీకి రాజమౌళి సినిమా ను విడుదల చేయలేక పోతే అప్పుడు రామా రావు వస్తానంటూ ప్రకటించాడు. ఆర్ ఆర్ ఆర్ అనుకున్నట్లుగానే వస్తే అప్పుడు ఏప్రిల్ 15న విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించారు.
ఆర్ ఆర్ ఆర్ విడుదల అయ్యి ఏప్రిల్ 15 కు విడుదల అవ్వాలి అంటే అప్పుడు కూడా పెద్ద సమస్య ఉంది. ఆ సమస్యను తప్పనిసరిగా ఢీ కొట్టాల్సిందే. ఏప్రిల్ 14వ తారీకున కేజీఎఫ్ 2 సినిమాను విడుదల చేయబోతున్నారు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 తో ఢీ కొట్టడం అంటే కాస్త రిస్క్ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యశ్ కు పెద్దగా ఇక్కడ ఇమేజ్ లేక పోవచ్చు.. కాని ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమాను చేయడంతో పాటు కేజీఎఫ్ 1 సినిమా భారీ విజయాన్ని ఇక్కడ దక్కించుకుంది. కనుక పార్ట్ 2 కోసం వెయిట్ చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. కనుక రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఓపెనింగ్స్ పై ఖచ్చితంగా కేజీఎఫ్ 2 ప్రభావం ఉంటుంది అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రామారావు కు పెద్ద సమస్య తప్పడం లేదు. విడుదల తేదీకి ఇంకా చాలా రోజుల సమయం ఉంది కనుక అప్పటి వరకు ఏమైనా జరగవచ్చు అంటున్నారు.