పెద్ద సినిమాలకు వేసవిలో పెద్దదెబ్బే.. ఎలా అంటే??

Update: 2021-01-20 01:30 GMT
తెలుగు చిత్రపరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల సంక్రాంతి సందర్బంగా విడుదల చేసిన సినిమాలకు ప్రేక్షకుల స్పందన చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను టెన్షన్ లేకుండా విడుదల చేసుకోవచ్చనే ఆశలు కల్పించింది ప్రేక్షకుల స్పందన. కానీ ఇప్పటికి భారీ సినిమాల దర్శకనిర్మాతలు మాత్రం భయపడుతూనే ఉన్నారు.

ఎందుకంటే ఓవైపు కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లలో 50% ఆక్యుపెన్సీకి మాత్రమే ప్రభుత్వాల నుండి అనుమతి లభించింది. చిన్న సినిమాల సంగతి ఎలా ఉన్నా పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం టెన్షన్ పడక తప్పట్లేదు. ఎందుకంటే భారీ బడ్జెట్ తో అంటే వందల కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమాలు 50% అక్యూపెన్సితో బడ్జెట్ ను రాబట్టుకురావడం చాలా పెద్దసవాల్.

అయితే బిగ్ బడ్జెట్ సినిమాలన్ని వేసవికి మాత్రమే విడుదల అవుతున్నట్లు ప్రకటించారు ఆయా సినిమాల మేకర్స్. అయితే ఇప్పుడు ఆ ఆలోచన మంచిది కాదని అనిపిస్తుందట. ఎందుకంటే సమ్మర్ లో కూడా స్కూల్, కాలేజీలకు సెలవులు లేవు. ఆన్‌లైన్ తరగతుల కారణంగా సిలబస్ మిగిలిపోవడంతో ఈ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఆలస్యం కావచ్చని నివేదికలు చెబుతున్నాయి. అంతేగాక మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం వర్కింగ్ డేస్ పెంచి.. ప్రభుత్వం వేసవి సెలవులను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంటర్మీడియట్ విద్యార్థుల వేసవి సెలవులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. కాబట్టి పెద్ద సినిమాల నిర్మాతలు విడుదల తేదీలను ప్రకటించే ముందు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇకపోతే ఈ వేసవిలో చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. అంటే సినిమా థియేటర్లన్ని బాగా రద్దీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి మేకర్స్ రిలీజ్ తేదీలలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారేమో!
Tags:    

Similar News