రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వంగవీటి చిత్రం.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 23న థియేటర్లలో సందడి చేయనుంది ఈ సినిమా. బెజవాడ రాజకీయాలను బేస్ చేసుకుని తీసిన సినిమా కావడం.. ప్రధాన పార్టీలకు చెందిన అప్పటి నాయకులు అందరూ ఈ సినిమాలో పాత్రధారులు అంటూ చెప్పడం వర్మ స్వయంగా చెప్పడంతో.. బాగానే ఇంట్రెస్ట్ కలిగింది.
అయితే.. డిసెంబర్ 23న వస్తున్న ఈ సినిమాపై అంచనాల సంగతేమో కానీ.. వివాదాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. అంతకు మించి రిలీజ్ నుంచి కూడా సమస్యలు ఎక్కువగానే ఫేస్ చేయాల్సి వచ్చేట్లుగా ఉంది. ముఖ్యంగా డీమానిటైజేషన్ ఎఫెక్ట్ ని ఎక్కువగా ఎదుర్కోవాలి. క్రేజీ ప్రాజెక్టులు అంతో ఇంతో ఈ సమస్యను ఫేస్ చేయగలుగుతున్నా ఎఫెక్ట్ మాత్రం పడుతోంది. మరి ఓ ఏరియాకి పరిమితమైన కాన్సెప్ట్.. అందులోను కులాల కుంపటి చుట్టూ తిరిగే కథ. దీన్ని రెండు తెలుగురాష్ట్రాల జనాలకు ఎక్కించడం చిన్న విషయం కాదు.
ఇది కాక క్రిస్మస్ పండుగ స్టార్టింగ్ టైంలో వంగవీటి మూవీ వస్తోంది. అక్కడి నుంచి న్యూ ఇయర్ వరకూ.. జనాలు హాలీడేస్ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉంటారు కానీ.. ఎక్కువగా వెకేషన్స్ పై దృష్టి పెట్టే టైమ్. ఇలాంటి సమయంలో రెండు కులాల మధ్య ఓ ప్రాంతానికి లిమిట్ అయిన కాన్సెప్ట్ తో తీసిన మూవీకి టాక్ బాగోకపోతే.. కనీసం పోస్టర్ వైపు కళ్లు తిప్పి చూసే టైమ్ కూడా ఉండదు. ఈ సమస్యలన్నీ వంగవీటి ఎలా అధిగమిస్తాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/