హైదరాబాద్ ఫిల్మ్ షూటింగ్ లకు హబ్ గా మారుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా వున్న ఫిల్మ్ స్టార్స్ ఇక్కడే షూటింగ్ లు చేయడానికి ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా వరల్డ్ ఫేమస్ రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఇక్కడే వుండటంతో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలంతా హైదరాబాద్ వైపే చూస్తున్నారు.
ఇక్కడే షూటింగ్ లు చేయడానికి ముచ్చటపడుతున్నారు. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, విజయ్, కిచ్చా సుదీప్, యష్, మోహన్ లాల్, హృతిక్ రోషన్, సూర్య, అజిత్, సల్మాన్ ఖాన్ హైదరాబాద్ లో షూటింగ్ లు చేయడానికి ఇష్టపడుతున్నారు.
అంతే కాకుండా ఇక్కడ నుంచే అత్యధికంగా పాన్ ఇండియా మూవీస్ వస్తున్న నేపథ్యంలో యావత్ దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు హైదరాబాద్ లో పేరు మోసిన స్టూడియోస్ వున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, సారధి స్టూడియోస్ వున్నాయి. అయితే వీటికి తోడు అల్లు అర్జున్ ఫ్యామిలీ అల్లు స్టూడియో పేరుతో `ఆహా` కోసం ఓ ఫిల్మ్ స్టూడియోని ప్రారంభించింది. త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్టూడియోని ఏర్పాటు చేయబోతున్నారట.
ఇదిలా వుంటే వీరి తరహాలోనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ భారీ ఫిల్మ్ స్టూడియోకు రెడీ అయిపోతున్నారని తెలిసింది. దిల్ రాజు ప్రస్తుతం తమిళ హీరో దళపతి విజయ్ తో `వారసుడు` పేరుతో ఓ భారీ మూవీని పీవీపీ సినిమాతో కలిసి నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కీలక షెడ్యూల్ కోసం ప్రస్తుతం శంషాబాద్ లో ప్రత్యేకంగా ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. ఆ స్థలం నిర్మాత దిల్ రాజుదే అని తెలిసింది. ఇదే స్థలంలో దిల్ రాజు డాటర్ హన్షితారెడ్డి సొంతం గా భారీ ఫిల్మ్ స్టూడియోని నిర్మించాలని ప్లాన్ చేస్తోందట.
కూతురు ఐడియాతో దిల్ రాజు ఏయిర్ పోర్ట్ కి అత్యంత సమీపంలో వున్న ప్రైమ్ లొకేషన్ లో భారీ హంగులతో ఫిల్మ్ స్టూడియోని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తన సినిమాల్లో పర్ ఫెక్షన్ కోసం తాపత్రయపడే దిల్ రాజు స్టూడియోని కూడా అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని దిల్ రాజు అఫీషియల్ గా ప్రకటించనున్నారని ఇన్ సైడ్ టాక్.
ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్ లని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ - శంకర్ లతో ఓ మూవీ, వంశీ పైడిపల్లి - విజయ్ ల కాంబినేషన్ లో మరో మూవీని నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రీకరణ దశలో వున్నాయి. ఇందులో వంశీ పైడిపల్లి - విజయ్ కాంబినేషన్ లో రూపొందుతున్న బై లింగ్వల్ `వారసుడు` మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.