రాజుగారు జ‌డ్జిమెంట్ పై ఇంత‌ ర‌చ్చ అందుకేనా?

Update: 2022-07-24 05:38 GMT
క‌థ‌ల‌ ప‌ట్ల నిర్మాత దిల్ రాజు జ‌డ్జిమెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.  నిర్మాత‌గా దాదాపు రెండు ద‌శాబ్ధాల సినీ ప్రస్థానం ఆయ‌న‌ది. డిస్ర్టిబ్యూట‌ర్ గా మొద‌లైన రాజుగారు అంచ‌లంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కూ 49 సినిమాలు నిర్మించారు. సొంత నిర్మాణంలో కొన్ని చిత్రాలు నిర్మించ‌గా..ఇత‌ర నిర్మాణ సంస్థ‌ల‌తో భాగ‌స్వామిగా మారి ఏడెనిమిది సినిమాలు నిర్మించారు.

నిర్మాత‌గా ఆయ‌న అనుభ‌వం ఆసాధార‌ణ‌మైన‌ది.  నిర్మాణంలో ఆయ‌నో స్కూల్ అని చెప్పొచ్చు. ఒక్క‌రాత్రిలో వ‌చ్చిన స‌క్సెస్  కాదది. ఎన్నో ఒడిదుడుకులు..అనుభ‌వాల‌తో నేడు ఈ స్థానంలో నిల‌బ‌డ్డారు. ఆ అనుభ‌వంతోనే ద‌ర్శ‌కుల క‌థ‌ల విష‌యంలోనూ అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు..స‌ల‌హాలు ఇస్తుంటారు. అవ‌స‌రం మేర‌ ఆయ‌న అభిరుచుకి త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌క‌-ర‌చ‌యిత‌లు క‌థ‌ని ఆ విధంగా మౌల్డ్ చేయాల్సి ఉంటుంది.

ఇది ఓపెన్ గానే దిల్ రాజు చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ముఖ్యంగా న‌వ‌తరం ద‌ర్శ‌కుల విష‌యంలో రాజుగారు ఇన్వాల్వ్ మెంట్ త‌ప్ప‌న‌సరి. కొన్ని కొన్ని ప‌రిస్థుతుల్లో క్రియేటర్స్ సైతం అత‌ని అనుభ‌వాన్ని రంగ‌రించి ప‌నిచేయాల్సి ఉంటుంది. ఆ ర‌కంగా రాజుగారు కాంపౌండ్ నుంచి ఎంతో మంది ద‌ర్శ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఫెయిల్యూర్ ద‌ర్శ‌కుల్ని సైతం త‌న బ్యాన‌ర్లో మ‌ళ్లీ రీలాంచ్ చేసి స‌క్సెస్ ట్రాక్ ఎక్కించిన ఘ‌నత రాజుగారి సొంతం.

అలాంటి రాజుగారు అంచ‌నాలు `థాంక్యూ` విష‌యంలో పూర్తి స్థాయిలో బొక్క బొర్లా ప‌డిన మాట అంతే వాస్త‌వం. నాలుగేళ్ల క్రితం ఈ క‌థ‌ని ర‌చ‌యిత ర‌వి రాజుగారుకి చెప్పారు. అప్ప‌టి నుంచి ఈ క‌థ‌ని సాన‌బెట్టి ఇటీవే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. అంటే థాంక్యూ లో రాజుగారి క్రియేటివిటీ కూడా కొంత ఉంది అన్న‌ది అంతే వాస్త‌వం. అలా ర‌వి..రాజుగారు..మ‌రోవైపు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్. కె. కుమార్ మ్యాజిక్ ఇలా ముగ్గురు `థాంక్యూ` వెనుక మూల స్థంబాలు గా నిలిచిని ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయారు.

ఫ‌లితాలు ఏమాత్రం ఆశాజ‌న‌కంగా రాలేదు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి  రొటీన్ క‌థ‌ని రాజుగారు ఎలా యాక్సప్ట్ చేసారు?  రాజుగారు లాజిక్  లేకుండా ఎలా లాక్ అయ్యారంటూ విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాజుగారు జ‌డ్జిమెంట్లు ఇటీవ‌లి కాలంలో త‌ప్పు అవుతున్నాయ‌ని  విమ‌ర్శ వ్య‌క్తం అవుతోంది. అయితే అసలు వాస్త‌వాలు వెలికితీస్తే రాజుగారు మరీ అంత విమ‌ర్శించే  స్థాయిలో వైఫ‌ల్యాలు ఇటీవ‌లి కాలంలో ఇవ్వ‌లేదని ఆయ‌న ట్రాక్ చూస్తేనే తెలుస్తుంది.

అయితే ఈ విమ‌ర్శ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా `థాంక్యూ` విష‌యంలో కాస్త అతిన‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేయ‌డం ప్ర‌ధాన కార‌ణంగా చెప్పొచ్చు. క‌థ‌లో అంతుంది..ఇంతుంది అని రిలీజ్ కిముందు మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. దీంతో అంచ‌నాలు నెక్స్ట్ లెవ‌ల్ కి చేరుకున్నాయి. కానీ తొలి షో అనంత‌రం అవ‌న్నీ నీటి బుడ‌గ‌లా..గాలి తీసేసిన బెలూన్ లో పేలిపోయాయి.

రాజుగారు సినిమా అంటే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ బ్రాండ్ ఐడెంటిటీ  ఉంటుంది.  కానీ సినిమాలో థాంక్యూ లో అది ఏకోసానా క‌నిపించ‌లేదు. వైఫ‌ల్యాలు ఎదురైనా మ‌రీ ఇంత పేల‌వంగా మునుపెన్న‌డు లేని స‌న్నివేశం ఇది. వాటికి తోడు చైతన్య అభిమానుల్లో అసంతృప్తి. చైత‌న్య‌ని  జోష్ తో రాజుగారు లాంచ్ చేసిన  అది అంచ‌నాలు అందుకోలేదు.

ఈసారైనా చైత‌న్య‌కి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చి  చై అభిమానుల్లో జోష్ ని నింపుతార‌ని చాలా మంది..చాలా ర‌కాల ఆశ‌లే పెట్టుకున్నారు. కానీ సీన్ ఇక్క‌డ రివ‌ర్స్ అయింది. అవ‌న్నీ ఇలా రాజుగారు మీద‌కి ఇప్పుడిలా ట్రాన్స‌ఫ‌ర్ అవుతున్నాయి.
Tags:    

Similar News