నైజాం రాజుకు ఆ సంస్థ నుంచి పోటీ

Update: 2022-09-04 05:42 GMT
నైజాం అంటే దిల్ రాజు .. దిల్ రాజు అంటే నైజాం. వైజాగ్ - ఉత్త‌రాంధ్ర‌లోనూ దిల్ రాజు హ‌వా కొన‌సాగుతోంది. సీనియ‌ర్ పంపిణీదారుడిగా అత‌డి చేతిలో భారీగా థియేట‌ర్లు ఉండ‌డంతో ఆట అనుకున్న విధంగా సాగుతోంద‌ని చెబుతుంటారు. ఇక దిల్ రాజుతో పోటీప‌డుతూ కొంద‌రు కొత్త పంపిణీదారులు విశ్వ ప్ర‌య‌త్నాలు చేసినా కానీ త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం క‌ష్టంగా క‌నిపిస్తోంది. వ‌రుస ఫ్లాపుల‌తో ఇత‌రులు దిగాలైపోతున్నారు. దాంతో స‌ర్రున దూసుకొచ్చిన వాళ్లు కూడా తెర‌మ‌రుగైపోతున్నారు.

కొన్ని పెద్ద సినిమాలు ఫ్లాపులైనా కానీ దిల్ రాజు సుదీర్ఘ కాలంగా తట్టుకుని నిల‌బ‌డ్డారు. ఒక‌సారి కింద ప‌డినా మ‌ళ్లీ వెంట‌నే ఒక పెద్ద హిట్టుతే లేచి నిల‌బ‌డ‌డం ఆయ‌న‌కు అల‌వాటు వ్యాప‌కంగా మారింది. గ‌డిచిన రెండేళ్ల‌లో ఆయ‌న ఇలానే త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగారు. భారీ ఫ్లాపుల‌తో పాటు భారీ హిట్లు అందుకుని గ‌ట్టెక్కారు. వ్యాపారంలో వంద‌కు 200 శాతం అనుభ‌వం అత‌డి సొంతమైంది కాబట్టి సిస్ట‌మ్ లూప్ హోల్స్ మీదా గ‌ట్టి ప‌ట్టున్న కింగ్ గా చెలామ‌ణి అయిపోతున్నాడు. చాలా కాలంగా నిర్మాత‌ల గిల్డ్ అధ్య‌క్షుడిగాను ఆయ‌న కొన‌సాగుతున్నారు.
Tags:    

Similar News