వాటే కామెడీ: అప్పుడు తిట్టుకున్నారు.. ఇప్పుడు స్నేహమేరా జీవితం అంటున్నారు..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరియు నిర్మాత నట్టి కుమార్ మధ్య కొన్ని సినిమాలకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల విషయంలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నట్టి కుమారుడు క్రాంతి - కుమార్తె కరుణలు డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేశారంటూ వారిద్దరిపై ఆర్జీవీ వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టడంతో.. పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. నట్టి క్రాంతి - నట్టి కరుణలు ఫోర్జరీ చేశారంటూ వర్మ పెట్టిన కేసులో వారిద్దరినీ అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్టే ఇచ్చింది. అయితే ఈ కేసుపై పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ - నట్టి కుమార్ ఇద్దరూ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు ప్రకటించారు. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాస్వితం అంటూ కలిసిపోయారు. తమ మధ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్న మిస్ అండర్స్టాండింగ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయని తెలుపుతూ ఓ వీడియోని వదిలారు.
ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలన్నీ తొలగిపోయాయని.. భవిష్యత్ లో మళ్లీ కలిసి వర్క్ చేస్తామని ఆర్జీవీ పేర్కొన్నారు. నట్టి క్రాంతి - కరుణ లపై ఉద్దేశ్య పూర్వకంగా విద్వేషంతో కేసు పెట్టలేదని.. ఆ పర్టిక్యులర్ సిచ్యుయేషన్ లో ఇది జరిగిందే తప్ప.. తామంతా బాగానే ఉంటామని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఇది మనీ విషయంలో వచ్చిన తగాదే తప్ప.. ఫ్యామిలీ పరంగా ఎలాంటి విభేదాలు లేవని నట్టి కుమార్ అన్నారు.
రామ్ గోపాల్ వర్మ తో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని.. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని నట్టి కుమార్ అన్నారు. కొందరు మధ్యవర్తులు ఇద్దరి మధ్య పెట్టిన చిచ్చు వల్ల రెండు నెలలు ఒకరికొకరం దూరమయ్యామన్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య అన్నీ సమిసిపోయాయని.. ఇకపై కలిసి వర్క్ చేస్తామని తెలిపారు. పరస్పర అంగీకారంతో ఒకరిపై మరొకరు పెట్టుకున్న కేసులను విత్ డ్రా చేసుకోనున్నట్లు వెల్లడించారు.
అయితే నిన్నటి వరకు నువ్వా నేనా అనే విధంగా ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ మాటల యుద్ధానికి దిగిన ఆర్జీవీ - నట్టి కుమార్.. ఇప్పుడు స్నేహమేరా జీవితం అంటూ కలిసిపోవడం పై నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. కయ్యానికి కాలు దువ్వుతూ ఇద్దరూ పోటాపోటీగా ప్రెస్ నోట్లు వీడియలతో దాడి చేసుకొని.. ఇప్పుడు చేతులు కలుపుకున్నారని అంటున్నారు.
దర్శక నిర్మాతలిద్దరూ కలిసిపోవడం హ్యాపీయే కానీ.. ఇన్నాళ్లూ వివాదం అంటూ జనాలను ఫూల్స్ చేసారని కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన మధ్యవర్తులు ఎవరనేది కూడా చెబితే బాగుండేదని అంటున్నారు.