ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ - డిస్ట్రిబ్యూటర్, నిర్మాత నట్టికుమార్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ తనని మోసం చేశాడంటూ నట్టి కుమార్ కోర్టుకు వెళ్లి 'డేంజరస్' (మా ఇష్టం) సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నారు. వర్మ ఓ వీడియోను విడుదల చేసి నట్టి కుమార్ సంగతి చూస్తా.. కోర్ట్ లోనే తేల్చుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం లాంటివి జరుగుతూ వస్తున్నాయి.
అయితే నకిలీ డాక్యుమెంట్స్ తో తన సినిమా విడుదలను అడ్డుకున్నారంటూ నట్టికుమార్ పై ఆర్జీవీ పరువు నష్టం దావా వేశారు. క్లియరెన్స్ ఆర్డర్ వచ్చింది కనుక 'మా ఇష్టం' చిత్రాన్ని మే 6న రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. నట్టి క్రాంతి - నట్టి కరుణల మీద ఫోర్జరీకి సంభందించిన కేసే కాకుండా.. వివిధ మీడియా ఛానళ్లలో తనపై చేసిన నిందలు, ఆరోపణలకు సంబంధించి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తో కలిసి కేసు వేస్తున్నట్లు వర్మ పేర్కొన్నారు.
ఫోర్జరీ డాక్యుమెంట్ ని ఉపయోగించి సినిమాని ఆర్థిక నష్టం కలిగించినందుకు డేమేజ్ కేసు కూడా వెయ్యబోతున్నామని అన్నారు. ఈ ప్రెస్ నోట్ తప్ప, ఇకపై నేను ఈ విషయంపై ఇంకేం మాట్లాడబోను.. జస్ట్ వాళ్ల పైన చట్టపరమైన చర్యలపై మాత్రమే దృష్టి పెడతాను.. అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయట పడబోతోందని ఆర్జీవీ తెలిపారు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా నట్టి కుమార్ స్పందించారు. వర్మ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆర్జీవీ స్వయంగా రాసిచ్చిన అగ్రీమెంట్లు, చెక్కులు అన్నీ ఫోర్జరీనే అంటున్నారు.. అన్నీ లీగల్ గానే తేల్చుకుంటామని అన్నారు.
''రాంగోపాల్ వర్మ.. నువ్వూ నీ తాత్కాలిక స్నేహితుడు రామ సత్యనారాయణ ఆడుతున్న నాటకాలు ఎవరికి తెలియవు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో స్నేహం నటించి, వారి చేత నీ సినిమాలకు పెట్టుబడులు పెట్టించుకుని, ఆ తర్వాత మోసగించడం నీకు తెలిసినంతగా బహుశా సినీ పరిశ్రమలో ఇంకెవరికీ తెలియకపోవచ్చు. మోసపోయిన వాళ్లంతా బయటకు వచ్చి, నీ నిజస్వరూపాన్ని ఇంతవరకు బయట పెట్టకపోవడం వల్లే, ఇంకెందరో నీ చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. నీ పాపాలు పండే సమయం ఆసన్నమయ్యింది. అందుకే నీకు ఈ విపరీత బుద్దులు పుట్టి, ఈ విధంగా వ్యహరిస్తున్నావు''
''మా ఇష్టం (డేంజరస్) - హిందీ 'ఖత్రా' చిత్రం విడుదలపై మేము స్టే తేవడంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. అది జరిగిపోయిన ఇన్ని రోజుల వరకు మెదలకుండా ఉండి, ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి ఓ నీచమైన పధకం రచించి, ఓ ప్రెస్ నోట్ తో బయటకు వచ్చిన నీ కుట్రలు ఎలాంటి వారికైనా ఇట్టే అర్ధమైపోతాయి. నీ సినిమాకు ఖర్చు లేకుండా సులువుగా పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం ఇలాంటి పథక రచన చేశావు. అయినా ఈ మేటర్ కోర్టు పరిధిలో ఉన్నది. నువ్వు చేసిన ఆరోపణలను ఖండించకపోతే డబ్బు విషయంలో నీ చేతిలో మోసపోయిన మమ్ములను కూడా నీ గురించి తెలియనివాళ్లు తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది. అందుకే సూటిగా ఈ సమాధానం ఇస్తున్నాను''
''నీవు స్వయంగా ఇచ్చిన డాక్యూమెంట్స్ ను కూడా ఫోర్జరీ అంటున్నావంటే.. నీది ఎలాంటి క్రిమినల్ మెంటాలిటీనో అర్ధం చేసుకోవచ్చు. నువ్వు ఇచ్చిన ఈ చెక్కులు.. నీ బ్యాంకు అకౌంట్ లు కూడా ఫోర్జరీ నే అంటావా?. ఎట్టిపరిస్థితులలో నీ నిగ్గు తేలుస్తాం. మేము కోర్టుకు వెళ్ళి ఆధారాలు పెట్టి మరీ స్టే తెచ్చాం. నువ్వు ఎలాంటి ప్రూప్స్ లేకుండానే మాకు నువ్వు స్వయంగా ఇచ్చినవే ఫోర్జరీ డాక్యూమెంట్స్ అంటున్నావు ఆంటే నీ నిజ స్వరూపం, నీ నమ్మక ద్రోహం ఎలాంటిదో ఇట్టే చెప్పవచ్చు''
''ఎంతో మోసగాడివైనా, నిన్ను అంత సులువుగా వదలి పెడతామని అనుకోవద్దు. తోటి నిర్మాతలను, అలాగే ఎంతోమంది పరిశ్రమలోని వారిని మోసం చేస్తున్న వర్మకు వంత పాడుతూ, ఈ పాపంలో పాలు పంచుకుంటున్న రామ సత్యనారాయణ ఈ పాపాన్ని మోస్తున్నందుకు నువ్వు అనుభవించక తప్పదు. లీగల్ గా కోర్టు ద్వారా ఈ విషయాలన్నింటిని తేల్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను'' అని నట్టి కుమార్ అన్నారు.